Menu Close
మనోల్లాస గేయం
- మధు బుడమగుంట -
Song

ఆడవే మయూరీ

OLD is GOLD అనే నానుడి ఏ సందర్భంగా జనించిందో గానీ కొన్ని విషయాలలో అది ఖచ్చితంగా సరిపోతుందని అనిపిస్తుంటుంది. మన సినిమా రంగంలోని సంగీత, సాహిత్య విషయాలలో ముఖ్యంగా సినిమా పాటలను రూపొందించిన విధానం కూడా 60,70 దశకాలలో వచ్చిన చిత్రాలను గమనిస్తే OLD is GOLD అనే భావనే కలుగుతుంది. నాటి గేయ రచనలు, తదనుగుణంగా అమరిన స్వరకల్పనలు కలకాలం మననం చేసుకునే విధంగా మనసుకు హత్తుకుని గుర్తుండిపోతాయి. చెల్లెలి కాపురం చిత్రం కోసం సినారె గారు వ్రాసిన ఈ పాటను పలకడం కొంచెం కష్టమే. మరి ఆ పదాలను గేయ రూపంలో గుక్క తిప్పుకోకుండా, ఉచ్ఛారణ దోషాలు లేకుండా శ్రుతి శుద్ధంగా పాడటం అంటే ఎంత కష్టమో!! మరి అంతటి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని అలవోకగా తన గాత్ర మాధుర్యంతో మనందరినీ మెప్పించారు మన మన బాలు గారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినుకోండి మరి. వీలైతే ఆ పదాలను ఒకసారి గుక్కతిప్పుకోకుండా ఉచ్చరించండి. మన తెలుగు సాహిత్య గొప్పదనం పరికించండి.

movie

చెల్లెలి కాపురం (1971)

music

కె.వి. మహదేవన్

music

ఆచార్య సి. నారాయణ రెడ్డి

microphone

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
చరణకింకిణులు ఘల్లుఘల్లుమన..
కరకంకణములు గలగలలాడగ..
హ..హ..హ

అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగమ్ములూగగా
వినీల కచభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా...

ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ..
నీ కులుకులు గని నా పలుకు విరియ..
నీ నటనలు గని నవకవిత వెలయగా..
ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ... ఆడవే మయూరీ

చరణం 1:
అది యమునా సుందర తీరమూ... అది రమణీయ బృందావనమూ..
అది విరిసిన పున్నమి వెన్నెలా... అది వీచిన తెమ్మెర ఊయలా..
అది చల్లని సైకత వేదికా.. అట సాగెను విరహిణి రాధికా..
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..

ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ..
నా పలుకులకెనయగు కులుకు చూపి..
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ

చరణం 2 :
ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా
ప్రమథనాధ కర పంకజ భాంకృత ఢమరు ధ్వని వినిపించగా..

ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత
దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల..

కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన.. వదనమ్ములోన..
కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన.. వదనమ్ములోన..

గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగములోన...
నీ తనువులోని అణువణువులోన ..
అనంత విధముల అభినయించి ఇక ఆడవే....ఆడవే.. ఆడవే...

Posted in December 2025, పాటలు