Menu Close
Kadambam Page Title
Vasanthaagamanam_title

ఈ ఉగాది నవతకు నాంది
కొత్త భవితకు సాగే ప్రస్థానం
చిగురించిన పసిడివన్నెల చిగురుల
కొమ్మకొమ్మా ప్రతిరెమ్మా చెమ్మగిల్ల
భువనము దివి తలదన్నె సొమ్మసిల్ల
ప్రకృతి వనితాకృతికి కడువింతశోభను తెస్తూ
నవవసంతమొచ్చేసింది
వగరు వగరు లేలేత చిగురుల
కొసరి కొసరి కడుపార ఆరగించి
పొగరెక్కిన గళంతో ఎలకోయిల
ప్రకృతి వనిత గుండె లోతుల
ఆలపించిన మధురగానం సాగెనీయిల
ఆలకించిన జీవకోటిసమూహమెల్ల
తన్మయత్వంతో ఊగెను అనుభూతిడోల

విరిసిన యెల్లజాతి విరుల
ధవళవర్ణ కుసుమాల
తురిమె ప్రకృతి వనిత తనకురుల
అరుణవర్ణవిరిపరాగాలు
ఆమె నుదుట చేరి కుంకుమై మెరిసె
పసిడి వన్నెల సుమపుప్పొడులు
ఆమె సుతిమెత్తని పాదాల పారాణై మురిసె
ప్రకృతి మధువై నవవధువై జగతిన నిలిచె

శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Posted in March 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *