Menu Close
mg

వందే మాతరం

‘వందే మాతరం, వందే మాతరం’ అనేది ఎంతో శక్తి కలిగిన స్వాతంత్ర్య సమరం నాటి ఒక గొప్ప నినాదం. ఆ తరువాత అదే పల్లవిగా ఒక గొప్ప దేశభక్తి గీతంగా కూడా మనందరికీ సుపరిచితం. అయితే ఆనాటి అంతటి గొప్ప భావావేశ గీతంలోని భావాలకు నేడు అర్థం మారిపోయిందని కించిత్ ఉద్వేగంతో ‘వందేమాతరం’ సినిమా కొరకు మహాకవి సి.నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాట ఎంతో మంది మనసులలో నిండిపోయి నేటి సమాజ పోకడల గురించి అందరూ ఆలోచించుకునే విధంగా చేసింది. సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో, జలం లేక బలం లేక జనం ఎండుతున్నది – ఈ వాక్యంలో ఎంత నిగూఢమైన భావావేశము ఉన్నదో మనకు అర్థమౌతున్నది. చక్రవర్తి గారి స్వరకల్పనలో వందేమాతరం శ్రీనివాస్ గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట ‘శార్వరి’ సంవత్సర శుభాకాంక్షలతో మీ కోసం...

పల్లవి :

వందే మాతరం.. వందే మాతరం
వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

చరణం 1 :

సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా..ఆ..
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది..
మంట రగులుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం 2 :

సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా..ఆ..
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది..
గిరాకి పెరుగుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం 3 :

పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది

సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ..ఈ..
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది..
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
అక్కడనే వున్నది....

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

Posted in March 2020, పాటలు