Menu Close
prabharavi

నల్లని గేదెలు
తెల్లని పాలు,
తెల్లని మనుషులు
నల్లని చీకటి.

ఉల్లిపాయ
కొండెక్కి కూర్చోలేదు,
ఉల్లిపాయే
కొండై కూర్చుంది.

భరత మాతకు
రెండు చేతులు
కర్షకుడు
ఉపాధ్యాయుడు.

రహస్యానికి
ఎండ భయం,
వెన్నెలలో నైతే
చెట్లకింద దాక్కోవచ్చు.

నా కోరిక లన్నీ
అడిగి తీర్చాడు దేవుడు,
పూజారి లేనప్పుడు
గుడికి వెళ్ళాను.

తెల్ల కార్డు కోసం
దేవుడు దరఖాస్తు,
ఆదాయం ఆయన దాకా
వెళ్ళనివ్వటం లేదు!

మనసు స్థలం
ఎత్తు గోడలు కట్టినా
పట్టించుకోకపోతే
ఎవడినో రుచి మరుగుతుంది!

సూర్య కాంతి
పగలంతా అనుభవించినా
రాత్రి లేడని
కొందరు తిడుతూనే వుంటారు!

నేను కవిని
రోగాలు రావు
వస్తే
తలకో హృదయానికో.

హలం కాదు,
కలం కాదు,
కులం
వదిలెయ్యకపోతే!

చెమటోడుస్తూ
సొంత ఉప్పు తినాలి,
కానీ పరుల చెమటే
రుచిగా ఉందట!

పంట చెడకుండా
కలుపు తీయాలి,
కత్తి కాదు,
కొడవలి కావాలి.

ఊబిలోకి జారిపడితే
కాపాడొచ్చు కాని
కావాలని జారిపడి
నిన్నూ లాగుతారు కొందరు!

గుడుల్లో పెరుగుతున్నది
కాదు భక్త సందోహం,
పాలకులు పెంచుతున్న
అభద్రతా భావం.

“కిరణం” సృజిస్తే
జనం గుండెల్లోకి వెళ్ళాలి
వేమనలాగానో
కాళోజీలాగానో.

బిడ్డల కోసం
చుక్కల అన్నంలోకి
వెన్నెల పాలు లేవు
రాత్రి తల్లి దిగులు.

మనిషీ నిద్రా
రాత్రి ప్రేమించుకుంటుంటే
అసూయతో
ఊరకుక్కల అరుపులు.

దృష్టి దోషం
పెరిగిపోయింది నేడు,
కవిత్వం
కళ్ళజోడు.

అత్యాశ ఆటో,
మూర్ఖత్వం ట్రాక్టరు,
ముందూ వెనకా జాగ్రత్త!
బతుకు రోడ్డుమీద.

బుక్ ఇస్తే
ఎక్కడేసి అర్పేస్తాడో
“పేసుబుక్”కు ఎదురుగానే
కామెంట్ల కాంతులు.

Posted in March 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!