రైతు కష్టం జానపదము
- జి. రామమోహన నాయుడు
పంటలన్నీ ఎండిపోయ మాబ్రతుకులు
మాడిపోయ చేరదీసేవారులేక ఆశలన్నీ
ఆవిరాయ
వాన చినుకు రానంటూ మొండికేసి కూ
ర్చుంది మమ్మ మరిచిపోయింది
ముద్ద కూడు పోయింది "పంట"
కట్టు బట్టలు కరువాయ
కాడిమాను ఇరిగిపోయ
కళ్ళముందే పశువులన్ని
కాటి కెళ్ళె పోయ కాటికెల్లే పోయ
ఎందుకయ్యాదేవుడా పుట్టించినావు
కణికరమే లేదా నీకు కనబడక దాగావు
డబ్బు లేక చదువు లేక బిడ్డకేమో కొలు
వు లేక కలలన్నీ కాటికెల్లి రమ్మంటూ పిలుస్తుంటే
ఆశ జీవిరైతన్న మోడుబారిన జీవితాన్ని
మొలుస్తూనే వున్నాడు పిడిలేని ఉలితో
మొనలేని మడకతో తన జీవితాన్ని
మలుస్తూ వున్నాడు తన జీవితాన్ని