Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

నవ్వు.. నవ్వించు...

మనసారా నవ్వుకుందాం, మానసిక ఆందోళనను తొలగిద్దాం.

మితిమీరిన ఆహారం.. శ్రుతిమించిన వ్యవహారం.

తిందాం, తిరుగుదాం.

ఎన్ని సంవత్సరాలు బతికినా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా జీవనయాత్ర సాగడమే ముఖ్యం.

రోజుకో మైలు ...రోగాలకు మైలు దూరం.  

ఆహార నియంత్రణ అవసరం లేదు, అన్నింటా మితం అత్యంత అపురూపం.

విధి విధానాలు మన చేతిలో లేవు కానీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.

కష్టాలు మనం నిర్ణయించుకొనే సుఖాల స్థాయిని బట్టి ఏర్పడతాయి.

మన ప్రశాంతత మనమే సాధించుకోవాలి. ఆ ప్రశాంతత మనతో పాటు ఉండే మందికి పంచాలి.

 

Laugh and make others laugh, a key to good health

Excess food intake, cause of many complications

Eat well, do well with physical activity

How long we lived in not the matter, how well we lived is what matters

Don’t restrict your food habits, make it small enough to survive

A mile per day, keeps you away from decease

You can’t decide your life but can mold it according to your wish and health

Problems have been created in proportion with your life ambitions.

You can achieve the peace of mind by yourself and share that with others around you.

జీవ రసాయన శాస్త్రవేత్తనై, మన జీవ ప్రక్రియల గురించి కొద్దో గొప్పో తెలుసుకొన్న నేను నేడు మన సమాజంలో జరుగుతున్న ఆకస్మిక రుగ్మతల మీద అందరిలో అవగాహన కల్పించి, చిన్న చిన్న జాగ్రత్తలతో మనం మనలను ఆరోగ్యవంతులుగా మార్చుకోవచ్చు అనే అంశం ప్రధానంగా “మన ఆరోగ్యం మన చేతిలో..” అనే ఒక ఉద్యమాన్ని చేపట్టాలని సంకల్పించాను. అందుకు మీరందరూ సహకరించ ప్రార్థన.

As a scientist in biochemistry, I learned and been learning the biological processes of our human body, the chemistry behind it. After seeing and hearing all the sudden major health problems in our community especially among the younger generations, I want to start an awareness agitation “our health in our hands” just to make every one of us to follow the simple basic steps to keep us healthy. I request you all to join me in this and start moving.

ముందుగా, మనందరం పదే పదే మాట్లాడుకునే, మన టీవీ కార్యక్రమాలలో, సినిమాలలో సదా చూపే ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే సందేశం మీద నాలుగు వాక్యాలు వ్రాస్తాను.

పేదా, గొప్ప అనే తేడాలేకుండా మనిషి మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఉపశమనం కలిగించేది మద్యం అనే అపోహలో అందరూ ఉండిపోతున్నారు. అందుకు విజ్ఞానవంతులు, పండితులు ఏమీ అతీతులు కారు. కారణం మనిషి బుర్ర ఎక్కడైనా ఒక్కటే. పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనలను మారుతుంటాయి. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని అందరూ మాట్లాడతారు కానీ ఎవ్వరూ ఈ సామాజిక రుగ్మతకు సరైన పరిష్కారం కొరకు ప్రయత్నించరు. పైపెచ్చు ఆ సమస్యను మరింత జటిలం చేస్తూ, తమకు తామే అనారోగ్యానికి చేరువౌతున్నారు.

తాత్కాలిక ఉపశమనం కోసం తీసుకొంటున్న ఆ మద్యపానమే చివరకు వ్యసనంగా మారి మనిషి జీవితాన్ని బలి తీసుకొంటున్నది. ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. మహానటి సావిత్రి గారి జీవితమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే ఒంటరితనం మనిషి మానసిక వ్యధకు కారణమైతే, చుట్టూ ఉన్న సమాజం ఆ వ్యసనాన్ని ప్రోత్సహించే ఉత్ప్రేరకం అవుతుంది. చివరకు ఎవరి కర్మకు ఎవరు భాధ్యులు అనే ప్రశ్నార్ధక చిహ్నంతో సరిపెట్టుకుంటున్నాం. నేటి ఆధునిక వైద్య విధానాల వలన మనిషికి తిరిగి ఆయువు పోస్తున్నారు కానీ జీవచ్చవాల మాదిరి బతుకుతూ ఇక్కడే నరకం అనుభవిస్తున్నారు. అంతేకాదు, క్షణికావేశంలో వీరు చేస్తున్న చిన్న పొరపాట్ల వలన వారి కుటుంబ సభ్యుల జీవితాలు కూడా బలౌతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు. కొద్దో గొప్పో చదువుకొని, సామాజిక స్పృహ కలిగి మనతో పాటు ప్రక్కవారికి కూడా ఆ అవగాహన కల్పిస్తే చాలు.

... సశేషం ...

Posted in August 2019, ఆరోగ్యం

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!