Menu Close
prabharavi

మనిషి ప్రయాణం
ముందుకో వెనక్కో!
కిందికి మాత్రం వద్దు
పైకి పోవటం మంచిది.

నోరు తెరిచిన దాన్లో
వెయ్యో వంతు
తల తెరిచినా
సూర్యుడి వయ్యేవాడివి!

కొన్ని చిన్న పార్టీలు
ఉప్పు లాంటివి
ఇతరులు కలుపుకుంటేనే
వాళ్ళ బతుకులు రుచి.

కాలేజీ అమ్మాయి
ఒంటరిగా శాంతం,
గుంపుగా ఉంటే
నయగరా జలపాతం.

రుచికి మూలం
ఉప్పు,
ఎక్కువ కలిపితే
ముప్పు.

నక్షత్రాల సంపదలో
మునిగితేలుతున్న చంద్రుడు
అయినా తప్పలేదు
క్షయ రోగం.

నాయకుడిలా నువ్వూ
గడ్డి తినకూడదు,
జంతువును దారికి
తెచ్చేవాడే మనిషి.

రాత్రి మొద్దుకు
ఎన్ని చక్కని చుక్కలో,
మధ్యలో దూరిపోవాలని
మాయదారి చంద్రుడు.

“వన్ మ్యాన్ షో”
విమర్శిస్తున్నారు సూర్యుణ్ణి,
చంద్రుడూ చుక్కలూ వగైరా
చీకటిలో చిక్కుకొని.

జీర్ణించుకోలేక పొతే
కష్ట నష్టాలే
మనసు కైనా
కడుపు కైనా.

Posted in August 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!