Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౫౬౧. మంచికిపోతే చెడు ఎదురొచ్చింది....

౫౬౨. చిచ్చుకలవారి కోడలు చిత్రాంగి.

౫౬౩. సిద్దెలో నూనుంటే చాలు, ఎన్ని ఇద్దెలైనా ఆడొచ్చు.

౫౬౪. ఆడలేక, మద్దెల ఓడు - అన్నట్లు...

౫౬౫. దరిద్రుడు తలకడుక్కోబోతే, వడగళ్ళతో వాన వచ్చిందిట!

౫౬౬. అంగవస్త్రానికి చిన్న, గోచీకి పెద్ద ...

౫౬౭. అభాగ్యుడికి ఆకలెక్కువ, నిర్భాగ్యుడికి నిద్దరెక్కువ.

౫౬౮. చీకటికి నక్షత్రా లెక్కువ.

౫౬౯. ఐశ్వర్యానికి ఆశలెక్కువ, పట్టుపరుపుకి నల్లు లెక్కువ.

౫౭౦. ఎరువు సొమ్ము బరువు చేటు.

౫౭౧. గుడ్డికన్ను మూసినా, తెరిచినా ఒకటే.

౫౭౨. చీర ఎరువిచ్చి, పీటపట్టుకుని వెంట తిరిగినట్లు.

౫౭౩. గుడ్డి కంటే మెల్ల మేలు.

౫౭౪. లేని బావ కంటే గుడ్డిబావ మేలు.

౫౭౫. చీమ గంగా యాత్రకు బయలుదేరిందిట!

౫౭౬. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు...

౫౭౭. మింగ మెతుకు లేదుగాని, మీసాలకు సంపంగినూనె కావాలన్నాడుట!

౫౭౮. పాము చిన్నదైనా కర్ర పెద్దదుండాలి.

౫౭౯. తేలుకి కొండిలో, పాముకి కోరల్లో విషం ఉంటుంది కాని ఖలునికి నిలువెల్లా విషమే...

౫౮౦. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం...

౫౮౧. దివిటీ ముందు దీపం వెలవెల...

౫౮౨. కాకి ముక్కుకు దొండపండు కట్టినట్లు ...

౫౮౩. పెట్టినమ్మకు పుట్టిందే సాక్షి!

౫౮౪. ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు...

౫౮౫. తనకు మాలిన ధర్మమూ, మొదలు చెడిన బేరమూ పనికిరావు.

౫౮౬. ఉదర నిమిత్తం బహుకృత వేషం!!

౫౮౭. కోటి విద్యలూ కూటి కోసమే !

౫౮౮. తిష్ట కుదిరితేగాని నిష్ఠ కుదరదు.

౫౮౯. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.

౫౯౦. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.

Posted in August 2019, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!