Menu Close
mg

మధురమే సుధాగానం

చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, వేవేల తారలున్నా నింగి ఒకటే కదా, ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా ...ఇటువంటి భావ ప్రకటన రచయితల ఆలోచనలలో ఎట్లా వస్తుందో అని నిజంగా ఆశ్చర్యమేస్తుంది. పైన చెప్పిన విషయాలు నిజంగా వాస్తవాలే కదా! మధురమైన సుధా రాగ రసానుభూతిని కలిగిస్తున్న ఇంతటి చక్కని పాటను మన సిరిమల్లె నాల్గవ వార్షిక సందర్భంగా అందించాలని మాకు అనిపించి ఈ పాటను లిపి తో కలిపి మీకు అందిస్తున్నాము. హాయిగా విని ఆనందించి, పాడి ఆ రసానుభూతిని మీరూ ఆస్వాదించండి.

చిత్రం: బృందావనం
రచన: వెన్నెలకంటి

స్వరకల్పన: మాధవపెద్ది సురేష్
గానం: ఎస్.పి. బాలు, ఎస్. జానకి

మధురమే సుధాగానం .. మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం

చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా.. కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా
శతకోటి భావాలను పలుకు ఎద మారునా.. సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా..
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా.. ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా..
ఎనలేని రాగాలకు నాదమొకటే కదా.. అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా..
మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం

మధురమే సుధాగానం.. మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం
మదిలో మోహన గీతం.. మెదిలే తొలి సంగీతం

Posted in August 2019, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!