Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

ముఖ్య ప్రక్రియలోని కొన్ని ఉప ప్రక్రియలు...

గమనిక: పంచపదులకు వర్తించే నియామలన్నీ ఉప ప్రక్రియలకు కూడా వర్తిస్తాయి.

  1. మీ పదములు నా పంచపది: ఇక్కడ ఒకరు 5 పదములు ఇస్తే దాని పైన మనము పంచపది వ్రాసి తిరిగి మనం 5 పదములు ఇవ్వాలి...ఇలా కొనసాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
    ఉదా: కలిమి, చెలిమి, బలిమి, మేలిమి, కూరిమి
  2. మీ పాదము నా పంచపది: ఇక్కడ ఒకరు ఒక పాదము ఇస్తే దానినే మొదటి పాదముగా చేసి మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక పాదము ఇవ్వాలి...ఇలా కొనసాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
    ఉదా: శత్రువునైనా క్షమించే గుణం ఉండాలి (ఇది మొదటి పాదముగా తీసుకుని పంచపది పూర్తి చేయాలి)
  3. మీ అంశము నా పంచపది: ఇక్కడ ఒకరు ఏదైనా ఒక అంశము ఇస్తే దాని పైన మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక అంశము ఇవ్వాలి...ఇలా కొనసాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
    ఉదా: స్వాతంత్ర్య దినోత్సవము
  4. మీ పాట నా పంచపది: ఇక్కడ ఒకరు ఒక పాట పల్లవి లోని 5 పదములు ఇస్తే, పాటలోని ఒక్కొక్క పదమును వేరు వేరు  పాదములలో ఉపయోగించి మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక పాట పల్లవి లోని 5 పదములు ఇవ్వాలి......ఇలా కొన సాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
    ఉదా: మల్లియలార మాలికలార మౌనముగా ఉన్నారా మా కథనే విన్నారా...
  5. మీ చిత్రము నా పంచపది: ఇక్కడ ఒకరు ఏదైనా ఒక చిత్రము ఇస్తే దాని పైన మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక చిత్రము ఇవ్వాలి...ఇలా కొన సాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
  6. నా చిత్రము నా పంచపది: ఇక్కడ మనమే ఒక చిత్రము ఎంచుకొని దానిపై పంచపది వ్రాయాలి.
  7. బాల పంచపది: సరళమైన పదములతో బాలలు అర్థం చేసుకునే అంశాలతో నియమాలను అనుసరిస్తూ వ్రాసేది.....బాల పంచపది.

నియమాలు

అ) 5 పాదాలు ఉండాలి.
ఆ) ప్రతి పాదములోనూ గరిష్టముగా 10 అక్షరాలు ఉండాలి.
ఇ) ప్రతి పాదము చివరా అంత్య ప్రాస ఉండాలి.
ఈ) 5 వ పాదము కవి నామముతో ముగియాలి.
ఉ) 5 వ పాదములో గరిష్ఠముగా(కవి నామము కాకుండా) 12 అక్షరాలు ఉండాలి.

సప్త వర్ణ సింగిడిగా పిలువబడే పై 7 పంచపది ఉప ప్రక్రియల గురించి రాబోయే సంచికలలో తెలుసుకుందాము.

*** సశేషం ***

Posted in December 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!