Menu Close
Kadambam Page Title
మాతృదేవోభవ
ప్రతిభ కత్తిరశెట్టి

అమ్మ!
ఒక అందమైన మాట, పరిచింది మనకి చక్కని బాట
అమ్మ చెంత ఉంటె ఒక దీట, కలవరానికి తావే లేదట

అమ్మ పాడే జోలపాట, పిల్లలకి సదా ఊరట
అమ్మ ఉన్న ప్రతి ఇంట, నిత్యం షడ్రుచుల పంటట

సహన శాంతానా ప్రతీ పూట, ప్రేమని నింపే అంతటా
చెడు ప్రవర్తనకి తన ఇంట, దండన మాత్రం తప్పదట

కుటుంబ సభ్యుల మధ్యట, పొందుకూర్చే ఆరట
వెంట తెచ్చింది తన ఇంట, కొదవలేని సందడిట
పలు సంప్రదాయాల సంకట, నిర్మిస్తుంది ఆనకట్ట
నిలుపుతుంది మన ఇంట, కలకాలం శాంతి భద్రతట

చిద్విలాసుని బహుమతి ఇట, మానవతకి బాసట
అదృష్ట దేవత మన ఇంట, సాక్షాత్తు భూమాతట

అమ్మ!
ఒక అందమైన మాట, పరిచింది మనకి చక్కని బాట
అమ్మ చెంత ఉంటె ఒక దీట, కలవరానికి తావే లేదట

Posted in May 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *