Menu Close
Lalitha-Sahasranamam-PR page title

నవమ అధ్యాయం (అమ్మవారి సర్వరూప, సర్వనామ, సర్వకార్య, సర్వ ఆసన, సర్వస్థాన సర్వజ్ఞత వర్ణన)

శ్లోకాలు: 61-70, సహస్రనామాలు: 249-304

281. ఓం ఉన్మేష నిమిషోత్పన్నవిపన్న భువనావళ్యై నమః

కనులు తెరిచినంత మాత్రాన బ్రహ్మాండాలను సృష్టించగలిగినట్టియు, కనులు మూసి బ్రహ్మాండాలు లయం చేయగలిగిన మహేశ్వరికి ప్రణామాలు.


282. ఓం సహస్ర శీర్ష వదనాయై నమః

అనంతమైన శీర్షవదనాదులతో జగత్తును రక్షించునట్టి తల్లికి ప్రణామాలు.


283. ఓం సహస్రాక్ష్యై నమః

సహస్ర శబ్దం-అనంతవాచకము, అనంత నేత్రాలతో తేజరిల్లు శ్రీమాతకు ప్రణామాలు.


284. ఓం సహస్రపాదే నమః

అనంతమైన పాదాలతో భక్తులను కాపాడు తల్లికి వందనాలు.


285. ఓం ఆబ్రహ్మకీట జనన్యై నమః

కీటకాది బ్రహ్మపర్యంతంగాగల సర్వజీవులను సృష్టించునట్టి మాతకు ప్రణామాలు.


286. ఓం వర్ణాశ్రమ విధాయిన్యై నమః

వర్ణాశ్రమ ధర్మాలను బ్రహ్మ ద్వారా ఏర్పరచునట్టి తల్లికి నమస్కారాలు.


287. ఓం నిజాజ్ఞారూప నిగమాయై నమః

ఆజ్ఞారూప వేద స్వరూపిణికి వందనాలు.


288. ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః

పుణ్యాపుణ్యకర్మల వలన కలుగు ఫలాలను ప్రసాదించునట్టి మాతకు వందనాలు.


289. ఓం శ్రుతిసీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికాయై నమః

శ్రుతి సీమంతాలని ఉపనిషత్తులకు నామాంతరము. అట్టి ఉపనిషత్తులు కూడా జగన్మాతను వర్ణించలేకపోయాయి. అట్టి వర్ణనాతీతమూర్తికి ప్రణామాలు.


290. ఓం సకలాగమ సందోహశుక్తి సంపుట మౌక్తికాయై నమః

సమస్తమైన ఆగమరూపశక్తులలో మౌక్తికాలవలె భాసిల్లు మాతకు వందనాలు.


291. ఓం పురుషార్థ ప్రదాయై నమః

చతుర్విధ పురుషార్ధాలనూ ప్రసాదించునట్టి జననికి ప్రణామాలు.


292. ఓం పూర్ణాయై నమః

పూర్ణపరబ్రహ్మ రూపిణికి వందనాలు.


293. ఓం భోగిన్యై నమః

నాగకన్యా స్వరూపిణికి వందనాలు.


294. ఓం భువనేశ్వర్యై నమః

సమస్తమైన భువనాలకూ అధీశ్వరికియైన మాతకు వందనాలు.


295. ఓం అంబికాయై నమః

సమస్త జగత్తులకూ మాతృమూర్తి యైన దేవికి వందనాలు.


296. ఓం అనాది నిధనాయై నమః

ఆద్యంతాలు లేని తల్లికి వందనాలు.


297. ఓం హరి బ్రహ్మేంద్ర సేవితాయై నమః

బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల ద్వారా సేవించబడునట్టి తల్లికి వందనాలు.


298. ఓం నారాయణ్యై నమః

నారాయణీమూర్తికి నమస్కారాలు.


299. ఓం నాదరూపాయై నమః

నాదబ్రహ్మ స్వరూపిణికి నమోవాకాలు.


300. ఓం నామరూపవివర్జితాయై నమః

నామరూపాతీతురాలగు మాతకు నమోవాకాలు.


301. ఓం హ్రీంకార్యై నమః

సిగ్గును కలుగజేయునట్టియును హ్రీంకారబీజాక్షరి స్వరూపిణియూ అయిన మాతకు ప్రణామాలు.


302. ఓం హ్రీమత్యై నమః

హ్రీం-- అనగా లజ్జ అని అర్థము. లజ్జ గల మాతకు వందనాలు.


303. ఓం.హృద్యాయై నమః

మనోజ్ఞమూర్తికి, హృదయాదవర్ధకురాలికి వందనాలు.


304. ఓం హేయోపాదేయవర్జితాయై నమః

ఇష్టానిష్టు, నింద్యానింద్య, ప్రవృత్తి నివృత్తులను వర్జించిన శ్రీదేవికి వందనాలు.


* * * నవమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in December 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!