Menu Close
Lalitha-Sahasranamam-PR page title

నవమ అధ్యాయం (అమ్మవారి సర్వరూప, సర్వనామ, సర్వకార్య, సర్వ ఆసన, సర్వస్థాన సర్వజ్ఞత వర్ణన)

శ్లోకాలు: 61-70, సహస్రనామాలు: 249-304

249. ఓం పంచప్రేతాసనాసీనాయై నమః

పంచప్రేతాసనం మీద విరాజిల్లు తల్లికి వందనాలు.


250. ఓం పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః

పంచ బ్రహ్మ స్వరూపిణియై తేజరిల్లుతూ లోకాలను రక్షించునట్టి మాతకు వందనాలు.


251. ఓం చిన్మయ్యై నమః

చిన్మయమూర్తికి అంటే చిదానంద స్వరూపిణికి ప్రణామాలు.


252. ఓం పరమానందాయై నమః

పరమానంద స్వరూపిణికి అంటే బ్రహ్మానందమే రూపంగా గల తల్లికి వందనాలు.


253. ఓం విజ్ఞాన ఘనరూపిణ్యై నమః

ఘనమైన విజ్ఞానమే స్వరూపంగా గల మాతకు ప్రణామాలు.


254. ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః

త్రిపుటి అనగా ధ్యాన-ధ్యాతృ-ధ్యేయరూపాలే, అట్టి త్రిపుటి అంటే శ్రీ విద్యా స్వరూపిణికి వందనాలు.


255. ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః

ధర్మాధర్మాలను రెండింటినీ వర్జించిన అపారశక్తిగల మాతకు వందనాలు.


256. ఓం విశ్వరూపాయై నమః

యావద్విశ్వమూ స్వరూపంగా గల మాతకు నమోవాకాలు.


257. ఓం జాగరిణ్యై నమః

జాగ్రదవస్థలో భాసిల్లు తల్లికి ప్రణామాలు.


258. ఓం స్వపంత్యై నమః

స్వప్నావస్థలో ఉండు దేవికి వందనాలు.


259. ఓం తైజసాత్మికాయై నమః

తైజసమూర్తి రూపిణి అయిన మాతకు వందనాలు.


260. ఓం సుప్తాయై నమః

సుప్తావస్థలో ఉండునట్టి దేవికి వందనాలు.


261. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః

అఖండమైన ప్రజ్ఞాసంపత్తిగల తల్లికి వందనాలు.


262. ఓం తుర్యాయై నమః

అవస్థాత్రయాతీతమైన తురీయావస్థలో తేజరిల్లునట్టి శ్రీదేవికి వందనాలు.


263. ఓం సర్వావస్థ వివర్జితాయై నమః

సమస్తమైన అవస్థలను వర్జించినట్టి మహేశ్వరికి ప్రణామాలు.


264. ఓం సృష్టికర్త్ర్యై నమః

సృష్టించున ట్టి మాతకు నమస్కారాలు.


265. ఓం బ్రహ్మరూపాయై నమః

చతుర్ముఖ బ్రహ్మ స్వరూపిణి అయిన మాతకు ప్రణామాలు.


266. ఓం గోప్ర్యై నమః

జగద్రక్షణ చేయునట్టి మాతకు ప్రణామాలు.


267. ఓం గోవిందరూపిణ్యై నమః

ధర్మమును రక్షించునట్టి గోవిందుని స్వరూపంతో తేజరిల్లునట్టి దేవికి ప్రణామాలు.


268. ఓం సంహారిణ్యై నమః

సంహారకర్త్రియగు మాతకు వందనాలు.


269. ఓం రుద్రరూపాయై నమః

రౌద్రరూపముగల రుద్ర స్వరూపిణికి వందనాలు.


270. ఓం తిరోధానకర్యై నమః

విశ్వాన్ని సంపూర్ణంగా తిరోధానం చేయునట్టిది- అంటే నాశనం చేయునట్టి మాతకు వందనాలు.


271. ఓం ఈశ్వర్యై నమః

ఈశ్వర స్వరూపిణికి వందనాలు.


272. ఓం సదాశివాయై నమః

సదాశివ స్వరూపిణికి ప్రణామాలు.


273. ఓం అనుగ్రహదాయై నమః

అనుగ్రహాన్ని ప్రసాదించునట్టి దేవికి వందనాలు.


274. ఓం పంచకృత్య పరాయణాయై నమః

సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను పంచకృత్యాలయందు ఆసక్తి కల తల్లికి వందనాలు.


275. ఓం భానుమండలమధ్యస్థాయై నమః

సూర్యమండలంలో మధ్యభాగంలో తేజరిల్లు మహేశ్వరికి వందనాలు.


276. ఓం భైరవ్యై నమః

శివునికి భైరవుడని నామమున్నది. భైరవుని ప్రియురాలు కనుక భైరవికి వందనాలు.


277. ఓం భగమాలిన్యై నమః

భగమాలినీ స్వరూపిణికి వందనాలు.


278. ఓం పద్మాసనాయై నమః

‘పద్మాసన’మందు తేజరిల్లు శ్రీమాతకు ప్రణామాలు.


279. ఓం భగవత్యై నమః

దేవతలందరిచేతా సేవించబడునట్టి భగవతీ స్వరూపిణికి ప్రణామాలు.


280. ఓం పద్మనాభ సహోదర్యై నమః

పద్మనాభుని చెల్లెలు అగు పార్వతీదేవికి వందనాలు.

----సశేషం----

Posted in November 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!