కర చరవాణి (మొబైల్ ఫోన్)
చరవాణీ చరవాణీ ;
మత్కర భూషణ కర చరవాణి
ఏమిటిలా చేస్తావు మమ్మల్ని పరేషాన్
ఊరు లేదు వాడ లేదు
నీ జాడ లేని గూడు లేదు అవనీతలంలో
ఎక్కడో పుట్టావు- లోకమంతా చుట్టేసావు
దేశాల ఎల్లలే చేరిపేసావు
పిల్ల లేదు పెద్ద లేదు-
అందరికి కావాలి నీ సాంగత్యం
నీవు లేక నరకమే మాకు అనుక్షణం
ప్రొద్దుటే లేవటానికి ఆలంబన నీ అలారం
రాత్రైన భరించంలేం నీ వియోగం
పండుగలకి పబ్బాలకి నీ పలకరింపు సందడి
చేదు వార్తలు చేరవేయటము లోనూ అదే నిర్వేదపు సడి
బుడుంగ్ బుడుంగ్ అంటూ వచ్చే మెసేజ్ లు
ధడక్ ధడక్ అంటూ తప్పిస్థాయి మా గుండె లయలు
ప్రకటనల బోరింగులు
మెసేజీ ల హోరింగులు
ఆకతాయి ల ఛీటింగులు
పరుగు పరుగున చేరవేసే చరవాణి
ఇకనైన మానుకో నీ తెంపరితనం
చెదరనీకు మా పిల్లల భవితవ్యం
చేయబోకు మా మనసులు గందరగోళం
కలుగనీకు మా ప్రశాంతతకు విఘాతం అనవరతం.
కవిత చాలా బాగుంది. శుభాకాంక్షలు !!