Menu Close
Kadambam Page Title
సౌగంధిక సుమం
వాసిరెడ్డి వాసంతి

సుందర మందారపు మరువపు...
లోగిళ్లలో...
కాంతులీనుచు... కళకళలాడుచు...
పరువపు....
ఊహల ఊయలలో ఊగుచూ...
మన్మందిరంలో.. ఆనంద డోలికా..
తరంగాలలో ఆగుచూ సాగుతూ...

కమనీయంగా.. కడు రమ్యంగా...
మైమరచి.. అందమైన భవిత వైపు.. కనులు సారిస్తూ...
ఆలోచన రాగాలను...
సరాగాలుగా మారుస్తూ...

కాల గమకాలను... గమ్యాలుగా
చేస్తూ...
పరిమళిస్తూ.... పరవశిస్తూ...
ఆనందిస్తూ... ఆలోచిస్తూ...

ప్రకృతిలో మమేకమై... ఊయలలో ఊగుతూ...
పరువపు అందాల సౌగంధిక..
సుమ సుందరమైన....
అమ్మాయి... ఆంతరంగం...
ఆనందంతో... సంతోషంతో..

అంబరాన్ని తాకుతూ... ఊగుతూ..
కలకాలం....
తన కనులముందు నిలవాలని...
ఆశిద్దాం....
అన్నీ అమర్చుదాం...
తన ఆనందపు జీవితాన్ని...
అవలోకిద్దాం...

ఆశీర్వచనాలు.. పలుకుదాం...

Posted in May 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *