Menu Close
Kadambam Page Title
అక్షర జ్యోతులు
పి.వి. ప్రసాద్

అక్షరాలు..
మనిషి మనుగడకు దారిదీపాలు!
జీవితాన్ని పరిపుష్టం చేసుకునే జ్ఞానదీపికలు!

అనంతమైన అక్షరాలు..
మదిలోని భావాలకు
కనిపించే దృశ్యాలకు
ప్రతిరూపాలై
రసపూరిత పవనాల్లా
గుండెగుండెనూ తాకుతుంటాయి.

ఘనమైన అక్షరాలు..
వేదమంత్రాల బీజాక్షరాలై
ఆధ్యాత్మిక ప్రపంచంలో
సరికొత్త లోకాన్ని సృష్టిస్తుంటాయి.

వినసొంపైన అక్షరాలు..
సువర్ణ రసఝరులై
వీణా మృదంగ రవళీ ప్రణవనాదంలా
శ్రోతల హృదయాలను రంజింప చేస్తుంటాయి

విలక్షణమైన అక్షరాలు..
పండితుల పాండిత్యానికి వెలుగులై
జనపద పదవాఙ్మయానికి మూలాలై
అనిర్వచనీయమైన అనుభూతులై
సాహితీ సామ్రాజ్యంలో
భాసిల్లుతుంటాయి.

క్షరం కానిది అక్షరం
అక్షరం ఈశ్వర స్వరూపం
అక్షరమే ఆత్మగౌరవం

అక్షర సొగసులు
అక్షయ సారస్వతంలో మణిమరకతాలు
అక్షర నిధులు
అమూల్య సంపదలు

అందుకే-
అక్షరలక్షలుచేసే
అక్షరాల్ని ఆదరిద్దాం !
అక్షర జ్యోతులతో
అజ్ఞానాంధకారాల్ని అంతం చేద్దాం !!

Posted in May 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *