Menu Close
Kadambam Page Title
కృతజ్ఞత
-- పారనంది శాంతకుమారి

ప్రియతమా!
గుండె గుడిలో
మనసు సెమ్మెలో
ప్రేమ వత్తితో
వెలిగే దీపం కృతజ్ఞత,
దాన్నక్కడే ఉండనీ!

కంటి తడిలో
కనుపాపల ఒడిలో
ఒత్తిడి తెలియక
పెరిగే పసిపాప కృతజ్ఞత,
దాన్నక్కడే ఉండనీ!

మౌనం చాటున
హృదయం చోటున
మురిపెంగా నిలిచిన
ముగ్ధ కృతజ్ఞత,
దాన్నక్కడే ఉండనీ!

గుండె గుడిలోని దైవం
కంటి తడికి కారణం
ముగ్ధకు మురిపెం
పసిపాపకి పానుపు
సమస్తం నీవే కదా!
మరి కృతజ్ఞతలు ఎందుకు
దానిని ఎల్లప్పుడూ మనసులోనే ఉండనీ!!!

Posted in June 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *