Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౮౭౧. ఏకుతో తాకితే, మేకు దిగ్గొట్టాడు!

౮౭౨. ఏటి ఒడ్డున చేను ఉంటే ఏటా వరద భయమే...

౮౭౩. ఏటికి ఎదురీది నట్లు ...

౮౭౪. ఏటి వంకరలు ఎవరు తీర్చాలి?

౮౭౫. ఏటిలో పారే నీరు ఎవ్వరైనా తాగొచ్చు.

౮౭౬. ఏడు మెతుకులు తిని, ఏనుగంత సత్తువ కావాలంటే వస్తుందా?

౮౭౭. ఏడ్చే వాళ్లకు ఎడమచేతిపక్కన, కుట్టే వాళ్ళకు కుడిచేతి పక్కనా ఉండకూడదు.

౮౭౮. ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడు - అందిట.

౮౭౯. ఏదారీ లేని వారికి గోదారే రహదారి.

౮౮౦. ఏ మందలో ఆవైతేనేం మన మందలో ఈనితే చాలదా...

౮౮౧. ఏం చేసుకు బ్రతకాలే అమ్మా - అంటే, నోరు చేసుకు బ్రతుకు బిడ్డా - అందిట ఓ తల్లి ...

౮౮౨. ఏ జాతి పక్షి ఆ జాతితోనే చేరుతుంది.

౮౮౩. ఏరు ఎన్ని వంకరలు తిరిగినా చివరకు కలిసేది సముద్రంలోనే.

౮౮౪. ఏరు ఎంత పెద్దదైనా కుక్కకు గతికిన నీళ్ళే దక్కుడు.

౮౮౫. ఏరు దాటి తెప్ప తగలబెట్టినట్లు...

౮౮౬. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది.

౮౮౭. ఏలడానికి ఊళ్లు లేవుగాని బిచ్చం ఎత్తేందుకు లేవా ఏమిటి ?

౮౮౮. ఏపని జరగాలన్నా దైవ సహాయం కావాలి.

౮౮౯. ఐదవతనం లేని ఆడది, ఆయువు లేని మొగాడూ జత ఔతారు.

౮౯౦. ఒంటి చేతితో చప్పట్లు రావు.

౮౯౧. ఒంటిగా ఉన్నకంటే జంటగా ఉండడం మేలు.

౮౯౨. ఒకడు పడే పాటు పదిమందికి సాపాటు కాకూడదు.

౮౯౩. ఒక్క తీగ లాగినా డొంక మొత్తం కదులుతుంది.

౮౯౪. ఒళ్ళు ఒంగని వాడు దొ౦గలాడ బోయాడుట!

౮౯౫. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు...

౮౯౬. ఒక్క కన్ను కన్నూ కాదు, ఒక్కబిడ్డ బిడ్డా కాదు.

౮౯౭. ఔషధం కాని మొక్క ఆవనిలో లేదు.

౮౯౮. కంచు మ్రోగినట్లు కనకం మ్రోగలేదు.

౮౯౯. కంచె లేని చేనూ, కన్నతల్లి లేని బిడ్డా ఒకటే...

౯౦౦. కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు?

Posted in June 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!