శివశరణపంచకమ్ |
|
శ్లో|| | వినతాసుతఘనవాహనసఖ! శంకరసుముఖ!
త్రిశిఖాయుధ! వృషవాహన! హిమపర్వతనిలయ! పురనాశన! మఖనాశన! స్మరనాశననయన! అఘనాశన! శితికంధర! శరణం తవ చరణమ్ || |
లయసంగతనటశేఖర! దశకంధరవినుత!
ప్రణవామృతనిరతప్లుతగిరిజాదృతకరణ! ఫణిభూషణ! ప్రమథాధిప! ద్విరదాజినవసన! గణనాయకగుహసంయుత! శరణం తవ చరణమ్ || |
|
అవరోధితబృహదంబరతటినీద్రుతగమన!
అతిభీషణరిపుషణ్మయభవసాగరతరణ! శలకోరగగజసేవిత! భసితాంచితకరణ! యమకింకరభయవారణ! శరణం తవ చరణమ్ || |
|
ధరణీధరతనయాముఖకమలారుణకిరణ!
శశిభూషణ! మృదుభాషణ! నతపోషణసుగుణ! అభిషేచనచమకస్తవనమకప్రియహృదయ! అమరాసురవరదాయక! శరణం తవ చరణమ్ || |
|
దనుజాంతకనరకేసరిమదమారకశరభ!
పరిరక్షితశరణాగతమృగలాంఛన! విమల! రఘుపుంగవపరిపూజితసికతాంగకలసిత! కురుమే శుభ మనిశం శివ! శరణం తవ చరణమ్ || |
Posted in March 2019, సాహిత్యం