గత సంచిక తరువాయి »
౪౧౧. గుర్రంలా కుక్కను పెంచి రెడ్డి తనే మొరిగాడుట!
౪౧౨. గుడిలో లింగాన్ని మింగేవాడు ఒకడైతే, గుడినీ, లింగాన్నీ కలిపి మింగేవాడు మరొకడు.
౪౧౩. తాడిని తన్నేవాడు ఒకడైతే, వాడి తలను తన్నేవాడు మరొకడు.
౪౧౪. ఊరు పొమ్మంటోoది, కాడు రమ్మంటోoది...
౪౧౫. ముక్కుకు మసిరాసుకుని కయ్యానికి తయ్యారైనట్లు...
౪౧౬. నేలసిరి చెట్టుకు నిచ్చెన వెయ్యాలా?
౪౧౭. కాళ్ళు పట్టుకుని లాగుతూంటే, చూరు పట్టుకుని వేలాడేడుట!
౪౧౮. మేనత్త కొడుకూ ఒక మగడేనా, ఉండ్రాళ్ళూ ఒక పిండివంటేనా?
౪౧౯. ఉదయాన్నే వచ్చిన చుట్టం, ఉదయాన్నే మొదలైన వాన, భోజనాలు అయ్యాకగాని వెళ్ళవు.
౪౨౦. చెడ్డ కాపురానికి ముప్పేమిటి, చంద్రకాంతలు వండవే పెళ్ళామా - అన్నాట్ట!
౪౨౧. అంగవస్త్రానికి చిన్నది, గోచీపాతకు పెద్దది ...
౪౨౨. నూరుగురు బిడ్డలున్న తల్లికైనా నూనె బిడ్డ ముద్దు.
౪౨౩. నావి రాజుగారివి కలిపి నూటొక్క ఆవులు; ముందు నడుస్తున్న నూరూ రాజుగారివి, వెనకాల వస్తున్న కుంటావు నాది - అన్నాడుట!
౪౨౪. సిద్దిలో నూనుంటే చాలు ఎన్నిద్దెలైనా ఆడొచ్చు.
౪౨౫. చిచ్చుకలవారి కోడలు చిత్రాంగి.
౪౨౬. ఆడలేక మద్దెల ఓడు - అన్నాట్ట!
౪౨౭. ఆడు, ఆడు అనేవారేగాని, ఆడేవారెవరూ లేరు.
౪౨౮. తన్నుమాలిన ధర్మమూ, మొదలు చెడిన బేరమూ పనికి రావు.
౪౨౯. తనకు లేదని ఏడిస్తే ఒక కన్ను, ఎదుటివారికి ఉందని ఏడిస్తే రెండవకన్ను పోగొట్టుకున్నాడుట!
౪౩౦. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలనుకున్నట్లు ...
౪౩౧. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు.
౪౩౨. చేసిన పాపం చెపితే పోతుంది.
౪౩౩. చాదస్తం మొగుడు చెపితే వినడు, కొడితే ఏడుస్తాడు.
- విధవైతే మాత్రం వేవిళ్ళు తప్పుతాయా...
౪౩౫. మంచి మనిషికి ఒక మాట, మంచి ఎద్దుకి ఒక్క దెబ్బ చాలు.
౪౩౬. చెరుకు తిన్న నోరు చేదు తినదు.
౪౩౭. పేదవాని కోపం పెదవికి చేటు.
౪౩౮. దంపినమ్మకి బొక్కిందే కూలి.
౪౩౯. కంటికి పెద్దది, చేతికి చిన్నది.
౪౪౦. ఊరు పోమ్మంటోంది, కాడు రమ్మంటోంది.