Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

రైతూ సూర్యుడి సంబంధం

పుస్తకం చదువుకుంటూ

“అమ్మ”ను నువ్వు “అమ్మమ్మా” అంటావు,

అమ్మకు కోపం రగిలిపోతుంది...

 

ఏదో అవసరం వచ్చి

“నాన్న”ను “తాతా” అని పిలుస్తావు,

నాన్నకు కడుపు మండిపోతుంది,

 

పుట్టినప్పటి నుండి

పుష్కర కాలం పాటు

ఈ అమ్మమ్మా, తాతల దగ్గర పెరిగిన నీవు

అమ్మమ్మలోనే అమ్మను కన్నావు,

తాతలోనే నాన్నను చూశావు...

 

ఆదివారం వస్తేనే-

ఆ రోజు కూడా ట్యూషన్ సెంటర్  లేకపోతేనే

అమ్మా, నాన్న బందరు వచ్చేవాళ్ళు,

ఉదయం వచ్చి సాయంత్రానికి బెజవాడ చెక్కేసేవాళ్ళు...

 

అమ్మానాన్నలను

అమ్మా, నాన్నా అని పిలవటానికి

నీ కెన్నాళ్ళు పట్టిందో గాని

ఏ పిల్లవాడు కనిపించినా నీవే అని

“బుజ్జులూ” అని పిలుస్తున్నాం ఈ నాటిక్కూడా...

 

అమెరికాలో మీ మామయ్య ఉన్నా

బెజవాడలో మీ అమ్మ ఉన్నా

నీ విప్పటికీ ఇంట్లో తిరుగుతున్న భావన మా కానందం...

 

నీవు బెజవాడలో ఉన్నా నీతోనే మేమున్నాం,

మేం బందరులో ఉన్నా మాతోనే నీవున్నావు,

తాతా మనవళ్ళ బంధం

రైతూ సూర్యుడి సంబంధం.

Posted in March 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!