రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
‘చిననాటి స్నేహమే అందమేమో..అది నేటి అనురాగ బంధమేమో’ బాల్యం నుండే ప్రేమికుల మధ్యన జనియించిన స్నేహబంధము పెద్దదై ప్రేమానురాగాల అనురాగ బంధమైతే, ఆ ప్రేమ నిజమై, కలకాలం నిలిచి వుంటుంది. ప్రేమానుబంధాలు ఎంత పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉంటే ఆ జంట కలకాలం ఆనందపూరిత జీవన సహచర్యంతో కలిసి మెలిసి జీవించగలరని ఈ పాటను ఆత్రేయగారు ఎంతో అద్భుతంగా రచించారు.
చిత్రం: సీతారామకళ్యాణం (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
గేయ రచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల
పల్లవి:
లలలలలలా... లలలలా లలలలలా..
లలలలలలా... లలలలా లలలలలా..
ఊహూహూ.. ఆహహా.. ఓహోహో..
లలాల.. ఆహాహా.. ఓహోహో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చరణం 1:
కలలన్ని పంటలై పండెనేమో... కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో.. అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో.. పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో.. పులకించు హృదయాలలో
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో
యెన్నెన్ని భావాలో ..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
చరణం 2:
చూశాను యెన్నడో పరికిణిలో.. వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో.. పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో
వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో
మునగాలి తేలాలి.. తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో
యెన్నెన్ని కౌగిళ్ళో..
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
లలలలలలా... లలలలలలా
లలలలలలా... లలలలలలా