నూతన సంవత్సర శుభాకాంక్షలు
- కొడుపుగంటి సుజాత
నూతన సంవత్సర తీపి చేదు
అనుభవాలను జ్ఞాపకాలుగా
మిగిల్చి నిషి రాత్రిలో కలిసిపోయింది
నిన్నటి సంవత్సరం
చీకటిని చీల్చుకుంటు
కాంతి పుంజంలా అందరి
జీవితాల్లో వెలుగు నింపాలని
సూర్యోదయంతో పాటు
ప్రతీ గుమ్మం తట్టి
నూతన జీవితానికి
నాంది పలుకుతు ప్రతీ
ఒక్కరిని వెన్ను తట్టి
ఉదయ కిరణాలతో
మేలుకొలుపు గీతం పాడుతుంది
కొత్త సంవత్సరం
అరాచకాలకు
అవినీతికి మంగళం పాడేసి
ఆడజాతి అర్థరాత్రి ఒంటిగ
నడవ గలిగిన రోజే నిజమైన
స్వాతంత్ర్యం అని పలికిన
జాతిపిత ఆశలకు
అంకురార్పణ నేటి నుంచే
ఆరంభం సూర్యచంద్రుల
సాక్షిగా తెలుపుతు
చీకటి జీవితాలకు చిరు
వెలుగందించి
బాల పాపాలకు బంగారు
భవిష్యత్తు ఇచ్చి
ప్రతీ తరుణిలో నూతనోత్సాహం
నింపి మగువ మగువకు
ఒక మగవాడు
తోబుట్టువనే బంధం కలిపి
అలరారుతోంది ఈ కొత్త సంవత్సరం
బాధలు సమస్యలు కాలమనే
రబ్బరుతో తుడిచివేసి
సంతోషాలని సంబరాలని
అమృత భాండంలా
మనకందిస్తుంది
ఈ నవోదయ నూతన
సంవత్సరం
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని
ప్రతీ ఒక్కరికీ విహాంగంలా అందించి
శాంతి సౌఖ్యాలను ఇంటింటా
పంచి ఇచ్చే
నూతన సంవత్సరానికి
స్వాగతం సుస్వాగతం
చాలా బాగుంది అండి కవిత