Menu Close
Kadambam Page Title

స్వ (సు) భాషితాలు

- సి. వసుంధర

  1. సుతిమెత్తని ఒక చిన్న మాట
    సుత్తి దెబ్బలా పనిచెయ్యాలి.
  2. చిన్న చిన్న సంఘటనలే
    మహా కావ్యాలకు మూలధనం.
  3. పదేపదే కనపడే రసావేశం
    అవతల వారికి మిగులుస్తుంది రసాభాసం.
  4. సు(స్వ)భాషితాలైనా స్వ(సు)భావోక్తులైనా
    చూరగొనాలి అవతలి వారి హృదయాలను.
  5. వాల్మీకికి మాల్స్ లేవు వ్యాసునికి హోటల్స్ లేవు
    భిక్షమడిగి కుక్షి నింపుకొని అక్షర లక్షలు మనకర్పించారు.
  6. జనవరి ఒకటైనా ఉగాది పండగైనా
    అర్థం పరమార్థం ఒక్కటే.
  7. అందరం అందుకే కలిసి రెండూ చేసుకొందాం
    ఆది మధ్యాంతరహితుడైన కాలపురుషుని పూజించుకొందాం.
  8. విందులు వినోదాలు ఎలా ఉండాలంటే
    అందరికి ఆమోద ప్రమోదాలనందివ్వాలి.
  9. శ్రుతిమించిన సంబరాలతో
    అపశృతులను ఆహ్వానించకూడదు.
  10. గతితప్పని కార్యక్రమాలతో
    పలుకుదాం జనవరికి స్వాగతం.
    జరుపుకొందాం సంబరాలను అంబరాన్ని అంటేటట్లు

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2020

Posted in January 2020, కవితలు

1 Comment

  1. Venugopal Gummadidala

    మాటల ముచ్చట్లు, భావాల బొబ్బట్లు, కోరికల కుంపట్లు ….బాగున్నాయి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!