Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

కలువ పూవు

Kaluva Puvvu

కలువ పూలవంటి కన్నులు అంటూ అందమైన అమ్మాయిల కళ్లను కలువపూల తో పోలుస్తారు.

కలువ శాస్త్రీయ నామం- నింఫియేసి. ఇది నింఫియేలిస్ చెందిన పుష్పించే మొక్క ల కుటుంబం. ఈ జాతి పువ్వుల్ని తెలుగులో కలువ పువ్వులు అంటారు. కలువ పువ్వు లు మంచి మెత్తని మృదువైన రేకులు కలిగి ఉండి, చెరువుల్లోనూ, నీటి కుంట ల్లోనూ, కాలువల్లోనూ పెరుగుతాయి. అందంకోసం పెంచుతారు.

కలువ పువ్వులు ఆంధ్రా ప్రాంతాల్లోని అన్ని తటాకాల్లో, చెరువుల్లోనూ కనిపిస్తాయి. కలువ పువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం. మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ అంటారు. నీటిలోని భూభాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పువ్వులు తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో చాలా అందంగా ఉంటాయి.

Kaluva Puvvu

కలువ పువ్వుకు చాలాపేర్లే ఉన్నాయి. ఉత్పలము, కజ్జలము, కలుహారము, కల్వ, కువము, కువలము, కువలయము, డోలాబ్జము, నిశాపుష్పము, పున్నాగము, రాత్రిపుష్పము అని వ్యవహరిస్తారు.

కలువ, తామర ఒకే కుటుంబము లోనివి, మొక్కలు నీళ్ళలోనే పెరుగుతాయి. ఆకుల, పూల కాడలు పొడుగుగా ఉంటాయి. వీనిలో గాలి ఉండను గొట్టాలవలె ఉన్నాయి. అంటే మనం కొబ్బరినీరూ, చల్ల పానీయాలూ తాగేస్ట్రాలాగా అన్నమాట. ఒక్కోకాడకు ఒకే పూవు పూస్తుంది.

Kaluva Puvvuకలువ మొక్క పెరిగినట్లుగా చెరువుల్లో, దొరువుల్లో తామర మొక్క పెరుగదు. ఇవి రెండూ అందంలో పోటీ పడేవే! కలువల్లోనూ తామర పూలలాగా తెలుపు, ఎరుపు, నలుపు కూడా ఉంటాయి. కలువ అందంలో తామరతో కొంచెం వెనుకంజే. కలువ సూర్యాస్తమయం తర్వాత చంద్రకాంతికి వికసిస్తుంది. అందుకే దీన్ని నిశాపుష్పం అంటారు. కలువ మొక్కలు మన దేశమంతా నీళ్లలో వేళ్ళు బురదలో నాటుకొని పెరుగుతాయి. మొక్క నీళ్ళలోనే పొట్టిగా ఉంటుంది. ఆకులు పెద్దవిగా గుండ్రంగా, తొడిమలు చాలా పొడుగ్గా నున్నగా ఉంటాయి. వీటి పొడుగు తొడిమ బోలుగా ఉండి దాన్లో గాలి ఉంటుంది కనుక ఆకులు నీటి మీద తేలుతుంటాయి. కాడ చివర ఒకే పువ్వు ఉంటుంది. వికసింపక మొగ్గగా ఉన్నప్పుడు నీళ్ళలోనే ఉంటుంది.

Kaluva Puvvuకలువ పువ్వు రాత్రి వికసిస్తుంది. కలువ కు మిత్రుడు చంద్రుడు. చంద్రుని కిరణాలు సోకగానే కలువ వికసించి రాత్రంతా తన అందం చాటుకుంటుంది. కలువలకు కూడా వైద్య విలువలున్నాయి. ఎఱ్ఱ కలువల వువ్వుల రేకులు హృదయ రోగాలను, నరాల నీరసాన్నీ, ఆయుర్వేదం ప్రకారం పోగొడతాయి. ఎర్రని కలువ గింజలు, అజీర్ణమునకును, వేళ్ళు జిగట విరేచనములు, రక్త విరేచనములకును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

Kaluva Puvvu
Posted in January 2020, వ్యాసాలు

2 Comments

  1. Lakshmi Narayana

    Thank you Himavathi Garu. Very good article. I am growing lotus and Lilly’s in my house.

    Neel utpal / Nalla Kaluva / Black lilly is this really available / myth? Pls suggest where I can get / buy this? Thank you.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!