కదిలే నదిలా నీ కథా .....
పయనం ఎటుకే అంతలా .....
ఆకాశమంత మనసే ఈ విశ్వమంతా పరిచే .....
ప్రేమేగా నీ కళా .....
విలయానకొడిగట్టే దీపాలకి ... సమురల్లె నీ సాయం అందేనులే
పొద్దేపొడుపేలేని ఆ కళ్ళలో ... ప్రభవించిన వింతలే ...
ఆకాశమే నీ ఆశయం ... ఆనందమే నీ సంతకం ...
కదిలే నదిలే నీ కథా .....
పయనం ఎటుకే అంతలా .....
మౌనం చేసే గీతాలాపం ... మమతేనంటా తన సందేశం ...
ఏ జన్మదో ఈ సుకృతం ...
నీ తోటి ఈ అమ్మ కలిసేనే ... పండుగై ఇలా ...
గుండెల్లో గాయాలు తొలిచినే తల్లిగా...
సీతాకోకా చిలుకల గుంపే ... ఏకమైన ఓ లోకం ఇదీ ..
వీర సైన్యమై నీకు కావలై గీత కాపు కాచెనే...
తొలిగిపోవు బాధలే .....,
కదిలే నదిలే తన కథే .....
పయనం ఎపుడూ ఆపదే .....
ఎవరే పాపం పసివాళ్ళంతా ... ఎందుకు చేరే నీ చుట్టుతా..
ఏమున్నదే నీ చెంతలో... ఒక్కక్క చిలకొచ్చి వాలిన నదివి నీవుగా ...
చేసావు సరికొత్త సాగునే పుడమి పై ...
గరళం మింగి అమృతం ఇచ్చే ప్రేమేనంటా నీ సన్నిధి ..
పడమటి నుండీ పొడిచేటి తొలిపొద్దు నీవేగా ఓ ప్రాణమా ...
నీ జన్మ చరితార్థమే ....
కదిలే నదిలే నీ కథే .....
పయనం ఎపుడూ ఆపకే .....