జంట చప్పుడుల తెలుగు మాటల పాడికలు
కందం
కటకట గిటగిట కొరుకుట
పెట పెట విరుచుట చిట పట పెనుగుట ముదితన్
పటపట పగులుట కదులుట
కిటకిట తిరుగుట తగదిక కిలకిల చాలున్
విరవిర మిలమిల విరిసెడి
రవరవ మిసమిస మెరయుచు లవలవ రవముల్
పరి పరి తె రవుల పడిప డి
దిరదిర తిరుగుచు మనసి క దిగ దిగ విసిగెన్
తుకతుక ఉడుకుతు మరుగుతు
తెకతెక తిరుగుతు తలపులు తికమక పడగన్
పక పక నగవులు అలుగగ
లుకలుక లకలక మనసుకు రువరువ కలుగున్
ఉత్పలమాల
ఒక్కరు కాపురారు జత,ఊపిరి పోవగ నెవ్వరెవ్వరో
నిక్కము తె ల్పగా సుతులు నీ హితులున్ సహచారిణిన్,సదా
మక్కువ గన్నవారలును,నా అనువారలు నీకు తోడుగా
ప్రక్కన రారుగాని భావ పాపపుణ్య మె వచ్చు నీడలా
ఎన్నియొ సంపదల్ వలచి ఇక్కడనే యిక శాశ్వతం బనన్
మన్నిక ఏ దిరా? ఉసురు మళ్ళిన వారలు మిన్ను కేగరే
ఎన్నియె కార్యము ల్ సలిపి నెంతయె డబ్బును కూడబెట్టిన న్
సన్నని నూలు పోగుయును చచ్చిన నీ దరి యుంచరే కదా
నాదని నాదు సంపదని నాకిక యేమని ఎన్నో మోసముల్
మో దము తోడ చేసితివి మూర్ఖుడ వై భవ బంధమందున్
ఏ దియు నీ కు దక్కదుర ఇంచుక తెల్సిన,చూడగా గతం
బెందరో వచ్చిపోయిరిర! ఏ మియు తేరిల, తీసుకెళ్లరూ!