Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు
6 “ఎడారి హృదయం”

నా హృదయం
భగ్నమైనది
బీటలు వారి
దగ్ధమై వున్నది
వర్షించి చాలా కాలం అయింది
నీ చల్లని చూపుల చినుకుల కోసం
పడిగాపులు గాస్తుంది.

నిరాశతో
క్రూరంగా
నా హృదయాన్నెందుకు మండిస్తావు?
మృత్యువువోలె
నల్లని ఆకాశం ఉగ్రరూపంలా వుంది.

ప్రభో! ఇకనైనా
నీ కరుణామయ ప్రభంజనాలతో
ఆ మేఘమాలను నా వైపుకు పంపించు
ఆకాశం పై మెరుపు
కొరడాలను ఝుళిపించు
నాపై ప్రేమజల్లులు కురిపించు

నిశబ్ధంగా
అంతటా కమ్ముకున్న
ఈ అజ్ఞానపు బడబాగ్నిని చల్లార్చు
నా హృదయం
భగ్నమైనది
బీటలు వారి
దగ్ధమై వున్నది
వర్షించి చాలా కాలం అయింది
నీ చల్లని చూపుల చినుకుల కోసం
పడిగాపులు గాస్తుంది.

నిరాశతో
క్రూరంగా
నా హృదయాన్నెందుకు మండిస్తావు?
మృత్యువువోలె
నల్లని ఆకాశం ఉగ్రరూపంలా వుంది.

ప్రభో! ఇకనైనా
నీ కరుణామయ ప్రభంజనాలతో
ఆ మేఘమాలను నా వైపుకు పంపించు
ఆకాశం పై మెరుపు
కొరడాలను ఝుళిపించు
నాపై ప్రేమజల్లులు కురిపించు

నిశబ్ధంగా
అంతటా కమ్ముకున్న
ఈ అజ్ఞానపు బడబాగ్నిని చల్లార్చు

***సశేషం***

Posted in November 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!