Menu Close
Kadambam Page Title
వర్షం లో రైతు
గవిడి శ్రీనివాస్

వాలే చినుకు లో
ఆశగా తడిశాను.
బురద సాలుల్లో
నారుగా మురిసాను.

ఎండిన కలలని తడుపుతూ
వడివడిగా దున్నుకుంటున్నాను.

ఎండలు శపిస్తాయో
వానలు ముంచేస్తాయో
కళ్ళనిండా  మేఘాలు
నిండి ఉన్నాయి.

గుండెనిండా ధైర్యం
పిండుకున్నాను.

కాసింత ఉరుములు భయపెడతాయి
కాసిన్ని పిడుగులు కూల్చేస్తాయి.

కాళ్ళు మట్టి పెళ్ళల్లో
ఉదయించందే
మనసు కుదుటపడదు.

రెప్పల వాకిట్లో
తెప్పలుగా కదిలే దృశ్యాల వెంట
ఆకు పచ్చని కలలు
ఊరటనిస్తాయి.

ఊపిరి పోసినా
ఊపిరి తీసినా
మట్టిని నమ్ముకునే
నా (రైతు) జీవితం ముగుస్తుంది.

Posted in August 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!