మాట రాని పసివాళ్లే, నడక రాని పిల్లలే! తప్పటడుగులేసారని తప్పులెంచుతామా? గుండెలపై తన్నారని గుర్తుపెట్టుకుంటామా? పసి పిల్లల మాటలకే పంతాలకు పోతామా? మాటను వినలేదని మన్నించక ఉంటామా? ---- సంసారపు ముంగిలిలో అడుగిడిన ఆ క్షణం పిల్లలమే చెలి మనం అనుభవమసలే లేదే తప్పటడుగులేసామని తప్పులెంచుకుందామా? గుండెలపై గాయాలను గుర్తుపెట్టుకుందామా? ఎదురుగ ఉంటూనే ఎంత దూరమయ్యామే కనిపించని గోడలెన్నొ కలసికట్టుకున్నామే పిల్లల తప్పులను ప్రేమతొ మన్నించాలే ఎదిగామే చెలి మనం ఇక ఎడమై పోరాదే
-43- నేను అవతారికను కనరాని యుగాన్ని తెరవని ప్రబంధాన్ని తెలవనిబంధ విముక్తుడ్ని చదివిన అదృశ్య అధ్యాయాన్ని శక అక్షర శత వత్సర ఆయుష్మంతుడ్ని. * నేను కాను, రాసిన కవిత్వాన్ని అవును, రాసుకుంటున్న ఆత్మమథనాన్ని అయినా నేను అందీఅందని నవమానవ అక్షరాన్ని. * నేను కాను, ఘ్రాణేంద్రియాలను కాను, చక్షురింద్రియాలను కాను, జ్ఞానేంద్రియాలను కాను, కర్మేంద్రియాలను అంతెందుకు కాను.పంచభూతాల సంయోగాన్నీ అయినా నేను ఆనందాన్ని. * నేను కాను, పంచ ప్రాణాలను కాను, సప్త ధాతువులను కాను, పంచ కోశాలను అయినా నేను అనుభవాన్ని. * నేను కాను, రాగానికి మాలికను కాను, ద్వేషానికి దోసిలినీ కాను, మదానికి జతగాడిని కాను, మాత్సర్యానికి జీతగాడినీ కాను, అర్థానికి కావడిని కాను, ధర్మానికి కావలినీ కాను, మోహానికి పారవశ్యాన్ని కాను, మోక్షానికి ప్రమోదాన్నీ నేను వీటి పటాన్ని కాను, పుటాన్నీ కాను. అయినా వాటికి నేను వ్యామోహ మోహాన్నే నాకవి అంతర్నిహిత అంతరిక్షాలే.
దొరికిన ఎముకను
కొరికి తినే ప్రయత్నం లో
తన దంతాలనుంచి
వచ్చిన రక్తాన్ని తాగుతూ
ఎముక బాగుంది అనుకుంటుంది శునకం
ఎదగాలనే అత్యాశతో
ఇసుమంత అవకాశం దొరికితే
తన శక్తిని ఊహకు మించి
రుధిరంగా చేసుకుని
అందరూ జుర్రుకుని తాగుతుంటే
తానెదిగాననుకుంటాడు మనిషి
మెున్న డెభ్బైయేళ్ళ మిత్రుడన్నాడు
చేతి కర్రను దగ్గరుంచుకున్నాను
కొడుకులాగా ..అని నవ్వుతూ....
నడిచే టప్పుడు ఆసరాగా
కూర్చొని లేచేటప్పుడు ఊతగా
కాలాక్షేపానికి అటూ ఇటూ తిప్పుతుండొచ్చని
నిజమే మిత్రమా
కొడుకులున్న ఎందరో తండ్రులను
ఏ కొడుకులు నడిపిస్తున్నారు ఊతమిచ్చి
ఆస్తుల అవసరాలు చూసుకుంటున్నారు కాని
అభిమాన ఆదరాలెక్కడ ...
ఒక్కో తండ్రిది ఒక్కో భాద
కార్పొరేట్ జాబ్ చేసే కొడుకు ఉన్న తండ్రికి
పగలు లేదు రాత్రి లేదు
మూలాలు చూసుకునే సమయమేలేని ఒత్తిడి
పల్లెల్లో పొలాలున్న తండ్రికి
పంపకాల పంచాయితీ లు
కాకుంటే కోడళ్ళ వేరు బాటు సందళ్ళు
నిజం నిజం మిత్రమా
అందిరాని కొడుకు కన్నా
ఎప్పుడు అందుబాటులో వుండే
కర్ర కొడుకే మేలు మేలు ....