Menu Close
sravanthi_plain

Sravanthi Jan 2019

2019 కి స్వాగతం!

తే.గీ. నూతనోత్సాహ మొసగి వినూత్నప్రగతి
ఆయురారోగ్యసంపద లందరి కిడి
మందహాసాలు ముఖసీమ లందు చింద
రమ్ము నవవత్సరమ! స్వాగతమ్ము నీకు
తే.గీ. ఆంగ్లమైనను తెనుగైన నాది యాది
క్రొత్తదన మన్నదే చిగుర్చును మనోర
థాల తరుశాఖ లన్నింటి కాలమిదియె
కన్న కలలన్ని పండ కాన్కల నొసంగు
ఉ. నేస్తమ! నీదురాకకయి నిన్నెతలంచుచు చూతు మయ్య నీ
హస్తములందు దాచుకొని యందగ జేయగ నేమి తెత్తువో?
వస్తువు లేవి యైనను శుభప్రదలక్షణభాసురమ్ములై
ప్రస్తుతవాస్తవమ్ములకు ప్రస్తరణంబగు శోభ గూర్పగన్
Posted in January 2019, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *