Menu Close
mg

ఏ తల్లి నిను కన్నదో

శ్రీ కృష్ణునికి యశోద కన్న తల్లి కాకున్ననూ ఎంతో ప్రేమగా పెంచి పెద్దచేసింది. అలాగే మన సమాజంలో కూడా ఎంతో మంది తల్లులు తమకు పుట్టిన పిల్లలతో పాటు, దత్తత కూడా తీసుకొని పెంచుకోవడం చేస్తుంటారు. మాతృత్వం అంటే కేవలం పేగు పంచుకొని పుట్టిన పిల్లలతోనే కాదు పెంచి పోషించి ప్రేమను పంచిన వారి వల్ల కూడా లభిస్తుంది అని కొత్త అర్థం చెప్పిన ఈ పాట దానవీర శూర కర్ణ చిత్రంలోనిది. కర్ణుడు కుంతీదేవికి సూర్యుని వరం వలన జన్మించినను, తనను పెంచి పెద్దచేసినది రాధ అందుకే అతడు రాధేయుడు అని కూడా పిలువబడ్డాడు. అతిరథుడు మరియు అతని భార్య రాధ పాత్రలతో చిత్రీకరించిన ఈ పాట ఇప్పుడు మీకోసం.

చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)

సంగీతం: పెండ్యాల

గేయ రచయిత: డా. సి. నారాయణ రెడ్డి

గానం: సుశీల

పల్లవి:

ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా...
నా వరాల తొలిపంటగా... ఆ.. ఆ.. ఆ..
నా వరాల తొలిపంటగా... నీవు నా ఇంట వెలశావురా
నా ఇంట వెలశావురా ...
ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా...

చరణం 1:

లలితలలితజల లహరుల ఊయలలూగినావు... అలనాడే
తరుణతరుణ రవి కిరణ పధంబుల... సాగినావు తొలినాడే
అజస్త్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడవు కావలెరా...
నీ శౌర్యము గని వీర కర్ణుడని...
నీ శౌర్యము గని వీర కర్ణుడని...  నిఖిల జగంబులు వినుతించవలెరా

చరణం 2:

మచ్చ ఎరుంగని శీల సంపదకు స్వఛ్ఛమైన ప్రతిరూపమై
బలిశిభిదధీచి వదాన్యవరులను తలదన్ను మహాదాతవై...
అడిగినదానికి లేదన్నది ఏనాడు నీ నోట రానిదై...
నీ నామము విని దాన కర్ణుడని...
నీ నామము విని దాన కర్ణుడని... యుగయుగాలు నిను స్మరియించవలెరా

Posted in January 2019, పాటలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!