Menu Close
mg

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు

మన తెలుగు పాటల మాధుర్యం అంతా సంగీత స్వరకల్పనలో ఉందని చెప్పలేము. ఎందుకంటే ఆ స్వరాల ఉనికిని ఆవిష్కరించేది చక్కటి తెలుగు పదాల పొందిక. అది సందేశాత్మక పాట కావచ్చు, ప్రణయ రాగం అవ్వచ్చు. ఏదైనా సరైన మాటలు దొర్లినప్పుడే ఆ పాట వినసొంపుగా మారి మనలను ఆకర్షిస్తుంది. ఉదయ ‘సంథ్యవేళలో చిలిపి చల్లగాలిలో అరుణకిరణ ధారనై ఒడిని చేరనా...’ ఇటువంటి ప్రయోగాల మాంత్రికుడు, పదాల పార్థుడు (రాజు), సిరివెన్నెల గీతాన్ని రచిస్తే మరి పాటకు వన్నెలు చేకూరక ఎట్లుంటుంది. శ్రీకాంత్, ఉహా నటించిన ‘ఆమె’ చిత్రంలోని ఈ పాట మీకోసం అందిస్తున్నాను.

చిత్రం: ఆమె (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సంగీతం: విద్యాసాగర్
గానం: SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు
కాటుకా.. అది నీలి మేఘ చారికా..
తిలకమా..పురివిప్పిన మన్మథ భాణమా
ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు
చిరు చిరు పెదవులపై ఊ..రుతున్నదీ మధువు

ఉదయ సంథ్యవేళలో చిలిపి చల్లగాలిలో
అరుణకిరణ ధారనై ఒడిని చేరనా...ఓఓఓ..
వెండిమబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో
కన్నెజాజి పువ్వునై కౌగలించనా

పరువాల పూదివిలోనా నెరజాణ
తమకాల తెరతీయనా
అధరాల కలయికలోన మృదువీణ
గమకాలు జతచెయ్యనా
తనువు నీది తలపు నాది
ధిరణ ధిరణ ధిరణ ధిరణ నా..

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ మనసు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు

నిలువ నీయనన్నదీ నిదుర మానుకున్నదీ
నిన్ను చేరమన్నదీ కన్నెప్రాయము ఓఓఓ...
వేళకాని వేళలో దారి కాని దారిలో
వయసు వేణువైనదీ ఎంత చిత్రమో

సరసాల సరిగమలోనా చెలికాడ
శృతులేవో సరిచెయ్యనా..
మదనాల మధురిమలోనా మురిపాల
శిఖరాలు చూపెయ్యనా

తనువు నాది తలపు నీది
ధిరణ ధిరణ ధిరణ ధిరణ నా..

ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు
చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు
కాటుకా.. అది నీలి మేఘ చారికా..
తిలకమా..
గురిపెట్టిన మన్మథ భాణమా
ఊహల పల్లకిలో
ఊరేగుతున్నదీ ఈ వధువు
చిరు చిరు పెదవులపై
ఊరుతున్నది మధువు

Posted in December 2020, పాటలు