Menu Close
Kadambam Page Title
నడిపించే ..నడక ...!!
-- డా. కె.ఎల్.వి.ప్రసాద్

నడక ..నడక ...నడక
నడకలోని మజా తెలిసాక
నడక కున్న _
ప్రధాన్యత ఎరుకయినాక,
నడకే నన్ను వరించిందో,
నేనే నడకను ప్రేమించానో,
చర్చకు పెట్టలేను గానీ,
నడక ఒక మత్తయింది,
నాపై ....
పెత్తనం చేయడం _
మొదలు పెట్టింది ....!

క్రమం తప్పని నడకలో,
అదుపు తప్పిన వంటి బరువు
క్రమబద్దం అయింది ....
చలాకీ తనం..
రేసుగుర్రమై పరిగెత్తింది,
ఉత్సాహం _ఉల్లాసం
అంబరాన్ని చుంబించాయి,
మధు మేహం గణాంకాలు,
ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాయి
నిలకడైన ఆరోగ్యానికి ..
నడక దిక్చూచి అయింది!

కాలం తర్వాత ...
కలిసిరానిదయింది ...
లాక్ డౌన్ మొదలయింది
బ్రతుకు నాలుగు గోడల మధ్య,
బందీ అయింది ....
బద్దకం
మొద్దు నిద్రకు తెర లేపింది,
ఊబకాయం
ఊపిరిపోసుకుంది,
నడక విలువ తెలిసింది!

నడక !నడక !నడక !
మొదలెట్టాలి _
మళ్లీ నడక ...
మూతిగుడ్డకట్టుకుని,
మొదలెట్టాలి నడక!
లేకుంటే తప్పదు కదా,
శాశ్వతంగా పడక ...!!

Posted in December 2020, కవితలు

23 Comments

  1. డి.వి.శేషాచార్య

    మధుమేహ బాధితులకు తీపి కబురు చెప్పినట్లుంది.

  2. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నడక గురించి చాలా చాలా బాగా వ్రాశారు సార్ సూపర్బ్ అక్కడ కామెంట్ పెట్టటం రాలేదు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు సో ….నైస్ కవిత
    —–అఫ్సర వలీషా
    ద్వారపూడి….తూ.గో.జి

  3. D.Nagajyothi

    వ్యాయామ విశిష్టత ను చెప్పే మంచి కవిత అందించారు డాక్టర్ గారు.బావుందండీ

  4. Shyam

    😁😁😁😁 ప్రస్తుత పరిస్థితుల కు నిలువెత్తు దర్పణం మీ కవిత్వం

  5. K S S BAPUJEE

    చక్కని కవిత. రచయిత కెఎల్వీ ప్రసాద్ గారికి అభినందనలు. నడక పై చక్కగా కవితను నడిపించారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!