Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

"అదేం లేదు. అక్కడ మీరు చూసేవి ఏమీ ఉండవు. చెబితే తెలిసే ఇన్ఫర్మేషన్ కి అనుభవం అవసరం లేదేమో. మీ ఇష్టం తీసుకు వెళ్ళమంటే తీసుకెళ్తాను." అన్నాడు మేథా.

"వద్దు అంకుల్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి చాలు." అన్నాడు చరణ్.

"భూమి ఉపరితలం వలెనే బుధుడి పైభాగం కూడా పగుళ్లతో కనిపిస్తోంది."అంది శార్వాణి.

"దీని ఉపరితలం చంద్రుని మాదిరిగానే ఉంటుంది.

"ఈ బుధుడి పై వాతావరణం బాగా పలుచగా ఉంటుంది ఇది సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల పగటివేళ విపరీతమైన వేడి, రాత్రివేళ విపరీతమైన చలి ఉంటాయి. క్రేటర్లు ఎక్కువ ఉంటాయి. దీని వ్యాసం 4878 కిలోమీటర్లు.

పగటి ఉష్ణోగ్రత 430 డిగ్రీలు రాత్రిపూట 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటాయి. మీ భూమి కన్నా 25 రెట్లు పెద్దది. మీరు దీన్ని సంధ్యా సమయాల్లో చూడవచ్చు." చెప్పాడు మేథా.

"బుధుడు కూడా భూమి లానే తన చుట్టూ తాను తిరుగుతాడా అంకుల్" అడిగాడు దినేష్.

"ఆ ... తిరుగుతాడు బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి 58 రోజుల 10 గంటల 30 నిమిషాల 34 సెకన్లు పడుతుంది." చెప్పాడు మేథా. వీరెక్కిన ఫ్లయింగ్ సాసర్ కొంచెం ముందుకు వెళ్ళింది.

"Wow .....అది ఎంత కాంతివంతంగా ఉందో ! ఆ నక్షత్రం." సంభ్రమాశ్చర్యాలతో ఓ వైపుకు చూపించింది శార్వాణి.

"అది నక్షత్రం కాదు అదీ ఒక గ్రహమే." అన్నాడు కౌషిక్.

ఎలా చెబుతున్నావు? గ్రహానికి నక్షత్రానికి తేడా ఎలా తెలుస్తుంది? అడిగింది శార్వాణి.

"నక్షత్రం అయితే బ్లింక్ అవుతుంది. గ్రహం అయితే స్థిరంగా వెలుగుతూనే ఉంటుంది." చెప్పాడు కౌషిక్.

"ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది శుక్రగ్రహం" అన్నాడు క్రేన్.

"ఎంతో కాంతివంతమైన శుక్రుడు అంటే నాకు చాలా ఇష్టం." అంది శార్వాణి.

"అవునా దీనినే ఉదయతార అని సంధ్యాతారా అని  పిలుస్తారు నీకు తెలుసా?" అడిగాడు క్రేన్.

"ఓహో ...అలాగా....నాకు తెలియదు. శుక్రుడు గురించి కొంచెం వివరంగా చెప్పవా ప్లీజ్?" అడిగింది శార్వాణి.

"ఇష్టమని చెప్పావుగా ఏం తెలియకుండానే!” ఆశ్చర్యంగా అడిగాడు డింగూ.

"ఆ కాంతి చూసి ఇష్టపడ్డాను తప్పా.... ఇప్పుడు తెలుసుకుంటున్నానుగా.." చిరు కోపంగా అంది శార్వాణి.

"సర్లే నాకు తెలిసింది కొంత చెప్తా విను. ఈ శుక్రుడు కొంతకాలం తెల్లవారుఝామునా, కొంతకాలం సాయంత్రంపూట కనిపిస్తాడు.

చంద్రుడి తర్వాత అతి ప్రకాశవంతమైన రోదశి పదార్థం శుక్రుడే. సూర్యుడికి భూమికి మధ్య లో శుక్రుడి పరిభ్రమణ కక్ష్య ఉంటుంది అందుకే సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత శుక్రుడు బాగా కనిపిస్తాడు..మన భూమి శుక్రుడు పరిమాణంలో ఒకే లాగా ఉంటారు అనేక విషయాలలో ఈ రెండూ ఎన్నో పోలికలు కలిగి ఉంటాయి. అందుకే వీటిని కవలగ్రహాలు అని కూడా పిలవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని తేడాలు కూడా ఉన్నాయనుకోండి." చెప్పాడు క్రేన్.

"నాకు శుక్రగ్రహాన్ని చూడాలని ఉంది మేథా ప్లీజ్ నన్ను అక్కడకు తీసుకెళ్ళవూ ....." బుంగమూతి పెట్టి గారాబంగా అడిగింది శార్వాణి.

"అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది మనం వెళ్ళలేము." అన్నాడు మేథా.

"సూర్యుడి దగ్గరకే వెళ్ళిన వాళ్ళం మనం. సూర్యుని నుంచి ఇది రెండో గ్రహం అంత వేడి ఉండదు. నువ్వు చాలా తెలివైనవాడివి. టెక్నాలజీ తెలిసిన వాడివి. నువ్వు అనుకుంటే మమ్మల్ని ఈజీగా తీసుకెళ్ళ గలవు. ప్లీజ్ మేథా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్." బతిమాలింది శార్వాణి.

కాసేపు ఆలోచించి "అయితే నేను చెప్పినట్లు వినాలి." అన్నాడు మేథా.

"ఓ అలాగే వింటాం." అన్నారంతా.

"అయితే మనం ఇప్పటిలా ఓపెన్ నుంచి చూడటం కుదరదు. అందువల్ల అందరం ఫ్లైయింగ్ సాసర్ లోని రెండో అంతస్తుకి వెళదాం." అన్నాడు మేథా.

సరే అన్నారు అందరూ.

మేధా ఓ బటన్ నొక్కాడు ఎలా కూర్చున్న వాళ్ళు అలా క్రిందకు వెళ్లి పోయారు. పై అంతస్తు క్లోజ్ అయ్యింది. ఫ్లయింగ్ సాసర్ రెండో అంతస్తుకు చేరుకున్నారు అందరూ. ఈ అంతస్తు మొత్తం గ్లాసుతో నిర్మితమై ఉంది. బయట ఉన్నవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి. వీరి కుడిచేతికి అందుబాటులో రెడ్, గ్రీన్, ఎల్లో బటన్స్ ఉన్నాయి. మేథా ఆ బటన్స్ చూపిస్తూ.......

"ఎర్ర బటన్ నొక్కితే మీ సీటు తో సహా మీరు బయట వాతావరణం లోకి వెళ్ళిపోతారు. బయట ఉన్న వాతావరణ ప్రభావం మీ మీద పడదు. ఆ విషవాయువులు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఎందువల్లనంటే మీ సీటు లో మీరు ఉన్నంతకాలం భూవాతావరణ ప్రభావమే మీ మీద పడుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు వదిలి బయటకు అడుగు పెట్టొద్దు. ఇక పోతే ఆ రెండో బటను గ్రీన్ ఉంది చూశారూ ... దాన్ని నొక్క గానే మీరు ఫ్లయింగ్ సాసర్ లోకి వచ్చేస్తారు.

ఆ ఎల్లో బటన్ కంట్రోలింగ్ బటన్. దానికింద యారో మార్క్స్ ఉంటాయి దాని ప్రకారమే మీ చైర్ లను మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. కుడి, ఎడమ, ముందుకి, వెనక్కి, పైకి, కిందకి, స్పీడు, స్లో ఇలా మనకు కావలసిన విధంగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అన్నీ ఎవరివి వాళ్ళవి సపరేటుగా ఉంటాయి.... కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారే తీసుకోవాలి." అని వివరంగా చెప్పాడు మేథా.

"అలాగే మేథా అంకుల్. నువ్వు చెప్పిన విషయాలు గుర్తుంచుకుంటాము." అన్నారు పిల్లలు.

వీరు ఎక్కిన ఫ్లయింగ్ సాసర్ శుక్ర గ్రహం మీద ల్యాండ్ అయింది.

అందరూ ఉత్సుకతతో ఎర్ర బటన్స్ నొక్కారు. గ్లాస్ డోర్ తెరుచుకుని వాళ్ళ చైర్స్ బయటకు వచ్చాయి. వాళ్ళ కుర్చీలు గాల్లో ఎగురుతూ ఉంటే వారికి ఎంతో అద్భుతంగా అనిపించింది. పిల్లలు కంట్రోలింగ్ బటన్స్ నొక్కుతూ గాలి లో విన్యాసాలు చేస్తుంటే.......పూల మకరందం సేవించే తుమ్మెదలను కదిలిస్తే అవి ఏం జరిగిందో అర్థం కాక అటూ ఇటూ తిరిగే తుమ్మెదల్లా కనిపించాయి వారి కుర్చీలు.

***సశేషం***

Posted in October 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!