సంపదనిన నే మి
ఆ. వె.
సంపద నిన నీకు గంపల నిండుగ
పసిడి పైకమున్న భాగ్యమవదు
అమ్మనాన్ననవ్వులందు ఆలుమగల
వలపునవ్వులందు నలరుచుండు
అప్పులేనిబతుకు అణకువ ఇల్లాలు
అరుగు మేని యున్న నదియె మేలు
భోగమగును నీకు రోగాలులేకున్న
అన్ని వినెడి బిడ్డలున్న చాలు
పాటుబడిననీవు పదుగురికైన నా
పరులనవ్వులందు భాగ్యముండు
మంచిమిత్రులున్న మంచిపేరుండిన
అది యే యసలు భాగ్యమనిన యిలను
నీవుతిన్నదేది నిలువదు మేనిన
పట్టెడన్నమైన పెట్టవోయి
చిన్నిసాయమైన చేయవోయి జనుల
భాగ్యమనిన నదియే పరులసేవ
సంపదే ది రాదు చచ్చిననాడిల
చేసినట్టి సేవ చిరము మిగులు
భూతదయ ను గల్గి పుడమిన వెలుగుమా
తృప్తి గలిగినట్టి తృణ మె ధనము