Menu Close
Shravanalakshmi_sravanthi_aug2019
తే.గీ.
క్రొత్త గృహిణులు క్రొంగ్రొత్త కోర్కె లెగయ
ఇంట శ్రీమతు లందఱు నెంతొ ప్రీతి
వ్రతములకు నోములకు నాంది పలుకునట్టి
సంబరంబుల మాసంబు శ్రావణంబు
తే.గీ.
కర్షకుల హర్షకారకవర్షములకు
వరుణదేవుని కరుణను వసుధఁ జేర్చి
సస్యలక్ష్మికిఁ బలుకుచు స్వాగతంబు
సకలశుభదాయకం బగు శ్రావణంబు

నందివర్ధనము*
శ్రావణం(1) బనిన బంధుమిత్రుల పరస్పరాభిమతముల్
శ్రీవరంబులనఁ జక్కఁగా వినుట(2) చేరి మీ గృహమునే
పావనంబుఁ గడు వైభవాన్వితముఁ బ్రత్యహంబగువిధిన్
దేవి లక్ష్మి కరుణించి చేయు తఱి(3) దీక్ష తోడఁ గొలువన్
............(1) శ్రవణానక్షత్రప్రధానమైనది శ్రావణమాసం. శ్రవణసంబంధమైనది ఈ మాసం.
............(2) మంచిమాటలు వినుట (శ్రవణం), వినిపించుట ఈ మాసధర్మం
...................శ్రవణం తొమ్మిది భక్తిమార్గాలలో ఒకటి.
............(3) సమయం

* ఇది లాక్షణికకవులు మెచ్చుకొన్న నేను సృష్టించిన క్రొత్తఛందస్సులో నడిచే వృత్త పద్యం. ప్రతిపాదంలో
ర-న-ర-న-ర-న-గ అనే గణాలతో 13వ అక్షరం యతినియమంతో మంచి గమకంతో నడుస్తుంది.

Posted in August 2019, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *