Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు

మరువలేని బ్రౌను దొర

అతడొక పరదేశీయుడు
అనన్య ప్రతిభావంతుడు

తెలుగు నుడి గుడిలో
కొలువైన దేవుడు
కొడిగట్టిన తెలుగు దీపం
వెలిగించిన వాడు

మరుగునపడిన తెలుగు గ్రంధాలు
ప్రబంధ వేమన సుమతీ శతకాలు
వెలికి తీసినవాడు
వెతలు పడినవాడు

ఎవడు వాడు ఓ ఆంగ్లేయుడు
గ్రీకు, లాటిన్, పారసీ,
సంసుకృతము నేర్చినవాడు
తెలుగు రుచి మరిగిన వాడు
మన తెలుగు నుడికి సూరీడు
అవును! అతడే బ్రౌను దొరవాడు

తెలుగునాట
బ్రతుకు బాటలు వేసిన వారు
కాటన్, మెకంజీ, మన్రో, బ్రౌను దొరలవారు

ఇంగిలీసు వారైతేనేమి?
ఇంకిత జ్ఞానమున్నవారు
మన తెలుగువారి కన్నను
వేయిరెట్లు గొప్ప మెప్పువారు

తెలుగు గొప్పతనం తీయదనం తెలిసినోడు
తెలుగుకు ఎనలేని సేవ చేసిన వాడు
కరువులలో అంబలి కేంద్రాలు
నెలకొల్పిన వాడు
తెలుగుకై సొంత ఆస్తులు
అర్పించిన వాడు
తెలుగుకై అప్పులు జేసి
తిప్పలు పడిన నిస్వార్థుడు

తెలుగు వారంతా ఋణపడిన వాడు
వెలుగు నుడికై రణము చేసినవాడు
మన సి.పి.బ్రౌన్ దొరవాడు

తొలి తెలుగు శబ్దకోశము
తెలుగు వ్యాకరణాంశము
తెలుగు నిఘంటువు వ్రాసిన వాడు

అతనికొక్క విగ్రహం లేని వాడు
జయంతి వర్థంతుల తేదీలు లేని వాడు
పాలకులు పాలతులు మర్చిపోయిన వాడు

తెలుగుకై తెలుగువారు
చేయని సాహసం చేసినవాడు
తెలుగునాట తెలుగుతో
జీవితమంతా సావాసం చేసినోడు

మన తెలుగున్నంత కాలం
అది వెలుగుతున్నంత కాలం
మనం మరువలేని మహనీయుడు
మన తెలుగింటి పొరుగు సోదరుడు
అట్టి గట్టి బ్రౌన్ దొర గారికి
వేల వేల మన దండాలు
ఆ ఇంగిలీసు దొర వారికి
తెలుగు వారి మప్పిదాల జేజేలు

....జై తెలుగుతల్లి
.....జై జై వెలుగు మళ్ళీ !!!!

Posted in December 2019, తేనెలొలుకు

1 Comment

  1. అనుపమ

    కృతజ్ఞతలు,సి. బి. బ్రౌన్ గారు గురించి చాలా చాలా బాగా చెప్పారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!