సిపాయీ సిపాయీ..
సలీం, అనార్కలి ప్రేమగాథ తెలియని ప్రేమికులు ఉండరేమో! అది ఒక విధంగా విషాదమైన చరిత్ర అయినను, పవిత్రమైన ప్రేమకు తార్కాణంగా నేటికీ అందరి మనసులను ఆకట్టుకొంటున్నది. అటువంటి కథతో తీసిన అక్బర్ సలీం అనార్కలి చిత్రంలో, నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారిన సుమధుర కావ్యం ఈ సిపాయీ సిపాయీ.. పాట. రామచంద్ర గారి స్వరకల్పనలో మహమ్మద్ రఫీ, సుశీల పాడిన ఈ పాట, ప్రేమికుల దినోత్సవ సందర్భంగా మీకోసం అందిస్తున్నాం.
సిపాయీ సిపాయీ..
సిపాయీ సిపాయీ..
సిపాయీ సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి వున్నానో
ఈ వాలుకనుల నడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ..ఓ..సిపాయీ
హసీనా హసీనా
హసీనా హసీనా
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూల మనసునడుగు అడుగు ఇకనైనా
హసీనా..ఓ..హసీనా
జడలోని మల్లెలు జారితే
నీ ఒడిలో ఉన్నాననుకొన్నా..
చిరుగాలిలో కురులూగితే
చిరుగాలిలో కురులూగితే
నీ చేయి సోకెనని అనుకొన్నా..
ఆ...మల్లెలలో కదలాడినవి
నా కలవరింపులే..
ఆ గాలిలో చెలరేగినవి
ఆ గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే...
హసీనా..ఓ..హసీనా
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
ఈ వాలు కనుల నడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ..ఓ..సిపాయీ
తడియిసుకలో గీసిన గీతలు
అలతాకితే మాసిపోతాయీ..
ఎదలోన వ్రాసిన లేఖలు
ఎదలోన వ్రాసిన లేఖలు
బ్రతుకంతా ఉండిపోతాయీ..
ఆ...లేఖలలో ఉదయించినవి
నా భాగ్యరేఖలే..ఏ...
మన ఊపిరిలో పులకించినవి
మన ఊపిరిలో పులకించినవి
వలపు వాకలే.....
సిపాయీ సిపాయీ..
సిపాయీ సిపాయీ..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూల మనసునడుగు అడుగు చెపుతాయీ
హసీనా..ఓ..హసీనా
సిపాయీ..ఓ..సిపాయీ
హసీనా..ఓ..హసీనా