౧౨౪౧. తాడు లేకుండానే బొంగరం తిప్పగల నేర్పరి!
౧౨౪౨. తాతలనాడు మావాళ్ళు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి - అన్నారుట.
౧౨౪౩. తాతగారూ ఏంచేస్తున్నారు - అని అడిగితే, తప్పులు చేసి దిద్దుకుంటున్నాను - అన్నట్లు...
౧౨౪౪. తాతా! తాతా, పెళ్ళాడుతావా - అని అడిగితే, పిల్లనిస్తావా మనుమడా - అన్నాడుట తాత!
౧౨౪౫. తానొకటి తలచితే, దైవం వేరొకటి తలచాడు...
౧౨౪౬. తాడిచెట్టు ఎక్కా వెందుకురా - అని అడిగితే, దూడకి గడ్డి కోద్దామని - అన్నాడుట!
౧౨౪౭. తాను మింగేదా లేక తనను మింగేదా - తరచి చూడాలి.
౧౨౪౮. తాను మెచ్చి తినాలి, మరొకరు మెచ్చేలా మనాలి.
౧౨౪౯. తా వలచినది రంభ, తాను మునిగింది గంగ!
౧౨౫౦. తామరాకు మీది నీటిబొట్టులా ఉండాలి...
౧౨౫౧. తాయెత్తు కడితేనే సంతానం కలిగితే ఇంక పెళ్లెందుకు?
౧౨౫౨. తాళ్ళపాకవారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత...
౧౨౫౩. తింటే ఆయాసం, తినకపోతే నీరసం.
౧౨౫౪. తింటే మీగడ తినాలి, వింటే భేగడ (రాగం) వినాలి ...
౧౨౫౫. తింటేగాని రుచి తెలియదు, దిగితేగాని లోతు తెలియదు.
౧౨౫౬. తిండికి ఏనుగు, పనికి పీనుగు.
౧౨౫౭. తిండికోసం వచ్చినట్లా, తిరణాలకు వచ్చినట్లా ...
౧౨౫౮. తిట్లకు చచ్చిన వాడూ లేడు, దీవనలతో బ్రతికిన వాడూ లేడు...
౧౨౫౯. తిండి చింత తీరని చింత...
౧౨౬౦. తిడితే గాలికి పోతాయి, తింటే లోనికి పోతాయి.
సామెతల ఆమెతలు