౯౩౧. ఆకలి ఎక్కువైందని రెండుచేతులతోనూ అన్నం తింటారా...
౯౩౨. ఆకలిగొన్నవానికి అనుష్టుప్ శ్లోకాలతో ఆకలి తీరుతుందా?
౯౩౩. గొడ్డు మంచిదైతే ఐన ఊళ్లోనే అమ్ముడుపోయేది.
౯౩౪. ఆచార్య ద్రోహం కంటే ఆత్మద్రోహం ఇంకా చెడ్డది.
౯౩౫. ఆడదాన్ని చూసినా, అద్దాన్ని చూసినా బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మతెగులు.
౯౩౬. ఆదర్శాలు శిఖరమెక్కిస్తే, అవసరాలు అగాధంలోకి నెడతాయి.
౯౩౭. ఈ దారి ఎక్కడకు పోతుంది - అని అడిగితే; ఎక్కడికీ పోదు, ఎప్పటినుండో అది ఇక్కడే ఉంది - అన్నాడుట ఒక ప్రబుద్ధుడు.
౯౩౮. ఆపదకు పాపపుణ్యాలు లేవు.
౯౩౯. ఆపద మొక్కులు - సంపద మరుపులు.
౯౪౦. ఆమడలు ఎక్కువైతే అంతఃకరణాలు దూరమౌతాయి.
౯౪౧. ఆముదపు గింజలు ఆణిముత్యాలౌతాయా...
౯౪౨. ఆమె పేరు కుంతల, చూడబోతే బట్టతల!
౯౪౩. ఆరంభ శూరుడికి ఆర్భాటం ఎక్కువ.
౯౪౪. ఆరిపోయే దీపానికి దీప్తి ఎక్కువ.
౯౪౫. ఆరు నెలలు సహవాసం చేస్తే చాలు, వారు వీరౌతారు.
౯౪౬. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
౯౪౭. ఆలివంకవాళ్ళు ఆత్మబంధువులు.
౯౪౮. తల్లివంక వారు తగినవారు, తండ్రి వంకవారు దాయాదులు.
౯౪౯. ఆలి అవసరాలు తీర్చడం ఊరికి ఉద్ధరింపు - అన్నాడుట!
౯౫౦. ఆవు నలుపైనా, పాలు నలుపు కావు.
౦౫౧. ఆవుల్ని మరలించిన వాడే అర్జునుడు!
౯౫౨. ఆవులూ ఆవులూ కుమ్ములాడితే లేగల కాళ్ళు విరుగుతాయి.
౯౫౩. ఆవూ, దూడా ఉండగా గుంజ అరిచిందిట!
౯౫౪. ఆశకు అవధుల్లేవు, అర్ధికి సుఖమూ లేదు.
౯౫౫. బెల్లం వండిన పొయ్యకు తొందరగా సెగ తగ్గదు.
౯౫౬. ఇంటి కళ ఇల్లాలినిబట్టి ఉంటుంది.
౯౫౫. ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొహమాటం పనికిరాదు.
౯౫౬. కంటికి రెప్ప, కాలికి చెప్పు రక్ష.
౯౫౭. కళ్ళుంటేనే కలియుగ దర్శనం.
౯౫౮. కందం చెప్పగల వాడే కవి.