౬౫౧. సంచీ లాభం చిల్లు కూడదీసిందిట!
౬౫౨. గాయాలన్నిటికీ కాలమే మందు.
౬౫౩. అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకడా!
౬౫౪. గొరగడం చేతకాక, బుర్ర వంకరన్నాడుట!
౬౫౫. కక్కుర్తి తిండి తిన్నా కడుపు నిండాలి ...
౬౫౬. విధవరాలికి దండంపెడితే, వెయ్యేళ్ళు తనలాగే వర్దిల్లమందిట!
౬౫౭. పెట్టిన వాళ్లకి పుట్టిందే సాక్షి.
౬౫౮. కూర్చుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెడతానందిట!
౬౫౯. పెళ్ళికి వెడుతూ పిల్లిని వెంట తీసుకెళ్ళినట్లు. ...
౭౦౦. పాటిమీది గంగానమ్మకి కూటిమీదే లోకం.
౭౦౧. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి ఎలాగౌతుంది?
౭౦౨. రాయిపైన విత్తితే రాజనాలు పండవు.
౭౦౩. కర్ణుని చావుకు కారణాలు అనేకం...
౭౦౪. కోకిల పంట పెరిగేది కాకి ఇంట...
౭౦౫. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతుంది.
౭౦౬. ఉన్నకర్మకు ఉపాకర్మ తోడయ్యింది.
౭౦౭. అర్ధరాత్రి మద్దెల దరువు...
౭౦౮. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు!
౭౦౯. తులసి వనంలో గంజాయి మొక్కలా ...
౭౧౦. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖ మెరుగదు.
౭౧౧. చిడుము సిగ్గెరుగదు.
౭౧౨. నలుగురూ ఏకమై, నల్లమేకను నల్లకుక్క అని ఒప్పించగలరు.
౭౧౩. అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించ కూడదు.
౭౧౪, సమయానికి లేని బాజా ఎందుకు, చంక నాకనా?
౭౧౫. పిట్టని కొట్ట - పొయ్యిలో పెట్ట...
౭౧౬. యధార్థవాదీ, లోక విరోధీ ...
౭౧౭. ఆ ఇంటికీ, ఈ ఇంటికీ మధ్య పచ్చగడ్డివేస్తే చాలు భగ్గుమంటుంది.
౭౧౮. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటిమీద వాలదు.
౭౧౯. ఎంత చెట్టుకి అంత గాలి ...