Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౧౨౧. ఉరమని పిడుగులా ...

౧౨౩. నింద సోకితే, జనం నిప్పులు చెరక్క మానరు.

౧౨౪. నలుగురూ నవ్విన నాపచేనే పండిందిట!

౧౨౫. చీమలపుట్టలో వేలుపెట్టాక, చీమ కుట్టిందని ఏడవకూడదు.

౧౨౬. ఇదిగో పులి - అంటే, అదిగో తోక - అన్నార్ట!

౧౨౭. దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేయ్యడానికి వచ్చారుట!

౧౨౮. ఆవూ, దూడా ఉండగా గుంజ అరిచిందిట!

౧౨౯. తినమరిగిన కోడి నెత్తెక్కి కూసిందిట!

౧౩౦. గుడ్డెద్దు చేలో పడినట్లు ...

౧౩౧. తాగింది దమ్మిడీ కల్లు, ఇల్లంతా చెడ ఊశాడుట!...

౧౩౨. నిండా మునిగాక ఇంకా చలి ఏమిటి!

౧౩౩. పాము శత్రువైతే పడగ చుట్టమౌతుందా?

౧౩౪. తుంటిమీద కొడితే మూతిపల్లు రాలాయట!

౧౩౫. దగ్గితేనే నిలవని ముక్కు తుమ్మితే ఉంటుందా!

౧౩౬. తన్నితే వెళ్లి బూరెలగంపలో పడ్డాడు!

౧౩౭. రొట్టె విరిగి నేతిలో పడిందిట!

౧౩౮. చినికి చినికి గాలివాన అయ్యిందిట!

౧౩౯. ఆలుమగల కయ్యం అద్దం మీద ఆవగింజ జారినంతసేపే!

౧౪౦. మంచికి పొతే చెడు ఎదురయ్యింది.

౧౪౧. చెరువుమీద కోపం వచ్చిందని, నీరు తాగడం మానగలరా?

౧౪౨. ఆకాశం మీద ఉమ్మాలనుకుంటే అదొచ్చి తన మొహం మీదే పడిందిట!

౧౪౩. చాప ఎంత చిరిగినా చదరంత మిగలకపోదు.

౧౪౪. ఇల్లు కాలిపోతే, బొగ్గులు ఎరుకున్నారుట!

౧౪౫. రాచదృష్టి తగిలితే రాయైనా పగులుతుంది.

౧౪౬. నరుని కంటపడితే నల్లరాయి పగులుతుంది.

౧౪౭. అద్దాలమేడలో కాపురమున్నవాళ్ళు ఎదుటివాళ్ళ ఇళ్ళపై రాళ్ళు రువ్వకూడదు.

౧౪౮. విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు!

౧౪౯. బొగ్గుల్ని, మండుతుండగా ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, చల్లారాక ముట్టుకుంటే మసి అంటుతుంది.

౧౫౦. ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తూంటే, చుట్ట ముట్టించుకునేందుకు నిప్పు దొరికిందని సంతోషించాడుట మరొకడు!

Posted in April 2018, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!