నాకొక్కటే పేరాశ!
గతంలో కాదు, తర్వాతిక్షణంలో జీవించాలని
నాతరంలో కాదు, తర్వాతి తరంలో వర్ధిల్లాలని!
ఆ పేరాశలో
తర్వాతి క్షణం, తర్వాతి తరం కాదుగా, ఉన్న క్షణం, ఉన్న తరంలోనే జీవించలేకపోతున్నాను.
జీవితం ఉన్న చోటనే నన్ను నేను పోగొట్టుకొంటున్నాను
అతి చనువుతో కొంతా, అతి ప్రేమతో కొంత
బేలతనంతో కొంతా, బెంబేలుతనంతో కొంతా
పేలవతతో కొంతా, ప్రగల్భతతో కొంతా
అజ్ఞతతో కొంతా, విజ్ఞతతో కొంతా
నన్ను నేను తెలియక కొంతా,
ఎదుటి వారిని తెలుసుకోలేక మరింత
నన్ను నేనే పోగొట్టుకొంటున్నాను
ఎన్నో రీతుల పోగొట్టుకొన్నాను
పోగొట్టుకొని పోగొట్టుకొని మిగిలిన నేను
లోన రెండుకొండల నడుమ ఇరుక్కొన్నాను
ఇక్కడ ఇరులెన్ని ఉన్నాయో, రాలిన విరులూ అన్ని ఉన్నాయి...
ఇరులకున్న రంగు విరులకు లేదు
వెలిసిన రంగే తప్ప, ఏ వాసనలూ మిగల్లేదు
చీకటి దట్టతలో ఉనికిని పోగొట్టుకొని
ప్రత్యూష కాంతి కోసం మూగగా తపసు చేస్తున్నాయి
పోగొట్టుకున్న అస్తిత్వపు విలువకు వెలుగూ చీకట్ల ప్రహసనంలో అర్థాన్ని వెదుక్కొంటున్నాయి..
.....................................
ఇదే బాగుంది....
గోల్కొండ కోటలో వెలుగూ నీడల ప్రదర్శన లాగుంది
'అస్తి న్నాస్తి' ఆత్మ నాటకం హాయిగా రక్తి కడుతూనే ఉంది
పోగొట్టుకొన్నదేదో, పోగొట్టుకోనిదీ
కళ్ళముందు కనబడుతూ ఉంది
శేషం, రేపటి మీది చిరుఆశతో ఎర్రటిమందారమై విరబూస్తూ ఉంది....
ఆశల పల్లకిలో
ఆశ అనేది చిన్న పిల్లల
చాకొలెట్ పేరు
పేరు అనేది
ఆశావాదుల పెరుగుదల పేరు
పేరాశ అనేది పేరుకోసం గిలాగిల్లాడే
వెంపర్లాట పేరు
గుక్కెడు నీళ్లకోసం
యుద్ధాలు చేసేవాళ్ళది నీరాశ నిండిన నిరాశ
దు అనే ప్రిఫిక్సుకే ఫిక్సయిన
లైఫ్ లాంగ్ సఫిక్స్ గాళ్లది దురాశ
అన్నీ చూసొచ్చిన
హండ్రెడ్ మీటర్ హార్డిల్ రన్నర్స్ కీ
హై-లాంగ్-జంపర్స్ కీ
EARTH పోల్ వాల్టర్స్ కీ
పేరేమిటి?-ఆశేమిటి?
ప్రిఫిక్సేంటి?-సఫిక్సేంటి?
బొమ్మలకీ తాళాలకీ పజిళ్లకీ
కీ
ఇవ్వడానికి తప్ప
ఈ దేహాన్ని ఎంతగా
బుజ్జగించినా
గాలి ఊయలలో చల్లగా
నిదురించదు,
పవన ధాటికి
అల్లాడి పోతుంది.
ఈ శరీరాన్ని ఎంతగా
గారాబం చేసినా
రక్కసి కోరల
రసనల అలజడికి
చిక్కుకుంటుంది,
ఈ ఆకృతికి ఎన్ని
భంగిమలు నేర్పినా
అద్దం వేలాడిన
మేకుకు తగిలి
జీర్ణ వసనమై రాలి పోతుంది
నటన కేవలం భౌతిక మాత్రం కాదు
ఆత్మ అనుసంధిస్తుంది,
వేషం అంతా మోసం కాదు,
సంఘ జీవితంలో
సమయానుకూలమై ప్రవచిస్తుంది.
భోగాలెన్ని ఉంటే మాత్రం ఏం
బుద్ధి పాశ్చాత్తాపం పొందుతూనే ఉంటుంది.
కవనం రాసింది చేతులు
మాత్రమే కాదు,
తపన పురికొల్పుతునే ఉంటుంది.
చూపుడు వేలు
ఎదుటి వారికి మాత్రమే కాదు
తదుపరి మననం
తనను ప్రశ్నిస్తుంది
వ్యగ్యం సరదాగా ఉంటుంది
సరిగా అర్థం కాని శ్లేష
అపార్థమౌతుంది
పొరపొచ్చాలకు
వివేకం పొరలను కప్పుతుంది.
పదుగురికి ఎంతగా బోధించినా
ఆధ్యాత్మం ఒదిగి ఉండనంటుంది
ప్రశంసలకు
పర్యావరణం నేత్రోత్సవ మౌతుంది,
అరమరికలు తొలగిన గడుసరి
ఉదయంలో
తెలి మబ్బులు తేలాడుతుంటే,
మనసెందుకో
ప్రశాంత మౌతుంది.
11.'అల్లోనేరేడు' ఆటల నాడి పాడి 'కోతికొమ్మంచి' ఆటల కూడియాడి 'కిర్రుగానుగ త్రిప్పుళ్ల' కేకలేసి కోర్కెతీరగ 'గుజ్జన గూళ్ళు' కట్టి 12.'బొంగరాలాట' నాడుచు పొంగిపోయి 'ఏలపాటల' నానంద డోలలూగి 'నాల్గుకంబాల' యాటలో నవ్వుకొనుచు ఆడి పాడుచు నందరు అలసిరంత! 13.క్షణము ఆటల నాపి విశ్రాంతి నంది మరల 'హల్లీసకమ్ముల' తిరిగి తిరిగి కుప్పిగంతులు వేయుచు కొంతసేపు 'గవ్వలాటల' నాడిరి కలసి మెలసి! 14.అంతమందు'దాగుడు మూత' లాడు తరిని బాలకృష్ణుడు దాగెను పూలపొదల- అలసి సొలసిన కన్నయ్య ఆదమరచి నిదురబోయెను చిక్కని పొదల మధ్య! 15.సంగడీ0డ్ర0త చెలికాని జాడనరయ పొదలమాటున దీక్షతో వెదకి వెదకి బాలకృష్ణు నెచ్చోటను పట్టలేక ఇంటికేగి యుండునని ఉహించుకొనిరి! 16.ఇచట పొదరింటి నీడ నిద్రించుచున్న బాలకృష్ణుని కాటేయ పన్నగమ్ము పడగ విప్పార్చి నాతని పజ్జ నిలువ అప్పుడొక కేకి సర్పమ్ము నడ్డగించె! 17.కాలసర్పము భీకారా కారమొప్ప తోకపై నిల్చి దరిజేరు కేకి జూచి బుసలు గొట్టుచు పడగను ముందుకూపి జుట్టుపులుగును బిట్టుగా జూచుచుండె! 18.అర్కబింబపు ప్రతిబింబ మైన రీతి పొగరుగా నిల్చే నత్తరి భుజగభుక్కు అగ్నికుండ0పు ప్రతిబింబ మైన భ0గి క్రూరముగ జూచె శిఖిని కాకోదరమ్ము! 19.భూరి ఫణిభుక్కు శౌర్యము పుట్టినిల్లు పుట్టచేర్పువు క్రౌర్యము మెట్టినిల్లు భుజగపరిపంధి సద్భావ మునకు గుర్తు కనులవినుకలి దుర్మార్గ మునకు గురుతు! 20.కాలక0ఠీ దేహమ్మును కాటువేయ పొగరు మించగ భుజగమ్ము పొంచియుండె నాగరాజును ఖండఖండ ములు సేయ చేవ వెలయంగ ఫణిభుక్కు చెంగలించె! 21.మేను విదిలించి కొంత దూరాన నిలిచి జాగరూకత జూచి లక్ష్యమ్ము నెంచి మెడల ఈకలు రిక్కించి మిడిసిపడుచు గొంతు పెకళించి నాగారి కూతవేసె! 22.తన్ను తన్నుకు ధరియిత్రి దద్దరిల్ల పోటు పోటుకు తనువెల్ల తూటువడగ మాటిమాటికి నగమును దాటుకొనుచు పౌరుషమ్మున పురిపుల్గు పొరుచేసె! 23.ఎదుటి శక్తిని క్షీణింప నెగిరి ఎగిరి ముక్కుతో మాటిమాటికి పొడిచి పొడిచి ధైర్యముగదూరిద్విజమును తన్ని తన్ని గగురుపాటును కలిగి0చె కాలకంఠి! 24.నట్టుపులుగిట్లు క్రమముగ దిట్ట యగుచు పోతరించుచు బలమును పుంజుకొనియె గూఢపాత్తు శరీరమ్ము గుల్లకాగ కలబలమ్ముతో కేకిని కాటువేసె! 25.కుంజరమ్మును సింహమ్ము క్రుమ్మినట్లు జింకపిల్లను బెబ్బులి చీల్చినట్లు చిలువతిండి విజృంభించ చిత్రగతుల నిలివజాలక భుజగమ్ము నీల్గి చచ్చె! 26.ఇటుల నయ్యవి పోరు ముగించినంత సంభ్రమమ్మున కృష్ణు డాశ్చర్యమంది మెల్ల మెల్లగ కేకి సమీపమునకు వచ్చి దాని మేనును దువ్వి పలికె నిట్లు! 27."నాదు ప్రాణాలు కాపాడి నవసి పోతి స్వామిభక్తికి నీవు దృష్టాంత మగుచు నింత విలువైన బ్రతుకు వెచ్చించినావు స్వార్థ మెరుగదు నీ భక్తి భావనమ్ము!" 28.అప్పుడహిభుక్కుస్వామితో ననియెనిట్లు- "స్వామి! నాకయి నీవింత వగవనేల? ప్రాణములు మేనియందు శాశ్వతము కాదు స్వచ్ఛమగు కీర్తి యొక్కటే శాశ్వతమ్ము! 29.నీదు రూపమ్ము నాలోన నిలిచెగాన సాహసమ్మున ముందుకు సాగినాను భుజగ మత్తరి మత్తిల్లి మొనసికట్ట విక్రమించితి మా జాతి పేరు వెలుగ! 30.అనగ కన్నయ్య దుక్ఖమ్ము నాపలేక నిబ్బరమ్మున మనసును నిగ్రహించి కరుణపొంగినహృదయము కంపమంద చివరి సారిగ దాని నాశీర్వదించి- 31."ఇట్టి చేతకు నుపకార మేమిచేతు? భువిని నాదు కృతజ్ఞతా స్ఫూర్తిమెరయ నీ కలాపమ్ము శిరసున నిలుపుకొందు" ననుచుహృదయభారమ్మున నరిగె శౌరి!