ఒంటరి లోకం లో
దూరం గా అలా చూపుల్ని వేలాది దీస్తున్నావ్
కాస్తంత దగ్గరవుతూ నా ఉహల లోగిలో ఉండి పోయావ్
జ్ఞాపకాల పొరల వెంట వాలుతూ
ఈ వెన్నెలనూ ఈ వెలుగులనూ
నాలోకి రార్చుకోవడమే మిగిలింది.
ఏవీ ఒలికిన ఆ వెన్నెల దరహాసాలు
ఒకింత చూసుకోవాలనుంది.
ఇక్కడ చిగురు టాకులు నన్నే చూస్తున్నాయి
గాలి తెమ్మెరలు నాలో వీస్తున్నాయి.
కాసిన్ని పిచ్చుకలు నా పై వాలి
నాలో ప్రకృతిని తట్టి లేపుతున్నాయి.
ఈ సాయంత్రం
నీ జ్ఞాపకాల తో వెన్నెల వాన లో తడిసి పోతున్నాను.
ఊగే చెట్ల కొమ్మల నడుమ
ఆకాశం నాపై వాలి
అనంత విశ్వాన్ని ఒంపుతున్నట్లుంది.
ఒంటరి లోకం లో కూడా
వేలాడే నీవు నా చుట్టూ ఉంటావు.
నీ జ్ఞాపకాల నొదిలి
మరింత ఒంటరిని కాలేక పోతున్నాను.
నా రెప్పల సంద్రం లో
ఒంటరి నావలా నీవు
తీరం ఒడ్డున ఎగిరిపడ్డ
ఇసుక రేణువు లా నేను
అలా చూస్తూ మిగిలి పోతాం...!