ఓ చెలీ...
ప్రభాతవేళల్లో ..
గడ్డిపోచలపై ముత్యాల్లా
మెరుస్తున్న వాటినిచూసి
మంచు బిందువులు
అని అర్థం చేసుకున్నాను
ఆకలికి దాహానికి
తేడా తెలియనప్పుడు
నాలో మొదలైంది...
ప్రేమ అని
అర్థం చేసుకున్నాను
నిను చూడలేనిదే ..
నే ఉండలేనన్నప్పుడు
అది విరహమని
అర్థం చేసుకున్నాను
కానీ ...
కానీ ...
నీ అరమోడ్పు కన్నుల భాషను ...
మాత్రం
అర్థం చేసుకోలేక పోతున్నాను
నీ నయన కిరణాలతో...తొలి మంచు తెరలను తొలగించి
నీకై నే కట్టిన ప్రేమ మందిరాన్ని తికకించవా చెలీ
నీకై....నీ చూపుకై...
తహతహ లాడే ఈ ప్రేమికుడ్ని పరికించవా చెలీ
నీ జిలిబిలి పలుకులతో...మన మధ్యన ఉన్న
నిశ్శబ్దాన్ని తొలగించవా చెలీ
ఓ చెలీ...
నీ చేయిని నా చేయితో పెనవేసి
నీ మనసుని నా మనసుతో ముడివేసి
నీ వెచ్చని కౌగిలిలో నను బంధించి. .
అధర మధురాన్ని అందించి నను నీలో కలుపుకో చెలీ.
నా తుది శ్వాస వరకు నీ కై ...నీ వాడిగాజీవిస్తాను చెలీ!!!