నేనెలా ఒంటరిని
- సుజాత కొడుపుగంటి
ఎవరన్నారు నేను ఒంటరినని?
వేకువ జామున తూరుపు తలుపు తీసుకొని బాల భానుడు
తన లేతతొలి కిరణాలతో పలకరిస్తుంటే నేనెలా ఒంటరిని?
పచ్చని తరువులు తలలూపుతు శుభోదయ గీతం పాడుతుంటే,
వేప చెట్టుమీది పక్షుల వింత స్వరాలతో నాకు సుప్రభాత సేవ జరుగుతుంటే నేనెలా ఒంటరిని?
వాగులు సెలయేరులు, నదులు, గలగల ఝరులతో సంగీత స్వరాలు అలపిస్తుంటే,
పక్వానికి వచ్చి పంటచేలు పురుడోసుకొని, ఆదరించి కడుపునింపగా నేనెలా ఒంటరిని?
నేలతల్లి నా భారం మోయగా, పరుగులు తీసే మబ్బులు
ఓ క్షణమాగి చిరు జల్లులతో చిరునవ్వు మరవద్దని కబురంపగా నేనెలా ఒంటరిని?
ప్రకృతికాంత పాన్పు వేయగా, జాబిలమ్మ ఊయలూపుతూ తారకలతో జోల పాట పాడగా
మేఘాల దుప్పటి కప్పుకొని తీపి నిదుర పోతున్న నేనెలా ఒంటరిని?
పుణ్య భూమి భారత గడ్డపై పుట్టి, పురాణాలు,ఇతి హాసాలను అవపోసన పెట్టి,
నాలోని అణువణువు మంచికి మార్గదర్శకం కావాలని అనుక్షణం హెచ్చరిస్తుంటే
ఇక నేనెలా ఒంటరిని?
నిజమే ఒంటరి అని అనుకుంటే ముందుకు ఉండదు మనుగడ. చాలా బాగా రాసారు. ధన్యవాదాలు
Very beautiful kavitha… especially some stanzas are lyrical and most enchanting.The author of these lines can make anyone feel that he/she is not alone in the cradle of mother nature!
Thanks for bringing out such a nice piece of poetry!