Menu Close
Kadambam Page Title
ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..!
పోలయ్య కూకట్లపల్లి

1.
కిటికీలో నుండి కనిపించే
గులాబి పూల పరిమళాలను
మనసారా ఆస్వాదించేవారు…
ప్రకృతి మాత ఆరాధికులే..!

కానీ…
ముద్దు గులాబీకి
ముళ్ళుంటాయి…
ముళ్ళను చూసి
ఆవేదన చెందేవారు…మూర్ఖులే..!

2.
కొలనులో జలకాలాడే
కలువభామల అందాలను
తిలకించి పులకించి పోయేవారు…రసికశిఖామణులే..!

కానీ…కొలనులో
బురదను చూసి
కుమిలిపోయేవారు…బుద్ధిహీనులే..!

3.
తోటి మహిళల్లో
తమ అక్కల్ని
తమ చెల్లెల్ని, తమ తల్లుల్ని
చూసుకుని గౌరవించే వారు…
హృదయ శుద్దిగల బుద్ధిమంతులే..!

కానీ…
కామంతో రగిలిపోతూ
పరస్త్రీలను పశుకాంక్షతో
కసికసిగా చూసేవారు…కామాంధులే..!

ఈ ముగ్గురు అందరికీ బద్దశత్రువులే…
ఆ ముగ్గురు అందరికీ ఆదర్శమూర్తులే..!

********

Posted in March 2026, కవితలు

1 Comment

  1. చ నా రా

    1… గాలి పరిమళం చూడటం ఏమిటి?
    2……కమలం జలకాలడుతుందా?
    3….ఆ ముగ్గురు….ఈ ముగ్గురు….యేమిటి
    ఈ ప్రయాస ?
    4…..గులాబీని చూసి ఆనందిస్తారు కానీ…
    ముళ్ళు ను చూసి ఆవేదన అనే మాట ఏమిటి?

    దయచేసి వివరణ ఇస్తే సంతోషిస్తాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *