మ్రోగింది కళ్యాణ వీణ
నారాయణ రెడ్డి గారి కలం నుండి జాలువారిన ఏ పాట అయినా ఒక సుమధుర భావ సంద్రమే. కురుక్షేత్రం సినిమా కొఱకు కృష్ణ, విజయనిర్మల మీద చిత్రీకరించిన ఈ ప్రణయ గీతం ఎంతో మధురం. కల వరించి.. కలవరించి ; పులకిత తనులత ; సుమశరుడు ఇటువంటి పదాల అల్లిక సినారే గారికి మాత్రమే సొంతం. పైపెచ్చు రాజేశ్వర రావు గారి స్వరకల్పన. ఇక ఈ పాట చిత్రీకరణ కూడా ఎంతో బాగుంది. బాలు గారు, సుశీల గారు ఆలకించిన ఈ మధుర గానం మీ కోసం.
చిత్రం: కురుక్షేత్రం (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గేయ రచయిత: డా. సి. నారాయణ రెడ్డి
గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..
మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
చరణం 1:
పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో..ఓ..ఓ..
నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నావో..
ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా
ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా
కల వరించి.. కలవరించి
కల వరించి.. కలవరించి.. పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
చరణం 2:
మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా..ఆ..
మయూరాంగనలు ఆట వెలదులై.. లయ లహరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
సుమసరుడే పురోహితుడై.. సుమసరుడే పురోహితుడై..
శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణ..
చాలా మంచి పాట.
Manchi song gurthu chesavu very nice mitrama