Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

26. ప్రమీల శర్మ

అంశం: కథ ప్రారంభం మాది ముగింపు మీది; శీర్షిక: పునరపి జననం

ఎదిగిన బిడ్డలు తనతో అవసరం తీరిపోయిందన్నట్టు ఏకాకిని చెయ్యడం శ్యామలని చాలా ఆలోచింపచేసింది. మూడు రోజుల క్రిందట అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న నలుగురు యువకుల్ని కలిసింది.

"మీ సర్వీస్ చూసాక మనిషి జన్మెత్తినందుకు జనన మరణాల సుడిగుండం నుంచి బయల్పడేందుకు నాకు కూడా ఏదో ఒకటి చెయ్యాలనుంది" అని చెప్పింది.

"ఈ వయసులో మీరిలాంటివి చెయ్యలేరు ఆంటీ. వీలైతే మాకు చేదోడుగా అనాథ శవాలను దహనం చెయ్యడానికి ఆర్ధిక సాయం చెయ్యండి చాలు" అన్న ఆ యువకుల మాటలు శ్యామలని ఆలోచింపచేసాయి.

తప్పకుండా చేస్తానని వారికి మాటిచ్చింది. కేవలం డబ్బు సాయం మాత్రమే కాకుండా, అనాథ శవాల దహనం తరువాత కర్మ కాండలు యధావిధిగా జరిపించేందుకు ఏర్పాట్లు తాను చేయిస్తాననీ... ఈ జనన, మరణ చక్ర భ్రమణం నుంచి జీవుడికి విముక్తి కలిగితే చాలని చెప్పడంతో వాళ్ళందరూ సంతోషించారు.

"ఈ వయసులో ఈమెకి ఈ ఆలోచన ఏంటి? ఒక ఆడది చేసే పనులా ఇవి?" అని చుట్టుపక్కల వాళ్లు గుసగుసలాడుకున్నా శ్యామల పట్టించుకోలేదు.

తన నిర్ణయాన్ని కొడుక్కి, కోడలికీ చెప్పినప్పుడు, వాళ్ళు సమర్థిoచినందుకు సంతోషించింది. మెల్ల మెల్లగా కూతురికి కూడా నచ్చ చెప్పుకోగలననే నమ్మకంతో అడుగు ముందుకు వేసింది శ్యామల.

-------

27. యలమర్తి చంద్రకళ

అంశం: కథ ప్రారంభం మాది ముగింపు మీది; శీర్షిక: మీకోసం మీరు జీవించండి

భర్త ఇల్లు వదలి వెళ్ళిపోయినా, శ్యామలమ్మ ఎన్నడూ నిరాశ పడలేదు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది. వారికోసమే బ్రతికింది. తనగురించి ఎన్నడూ ఆలోచించుకోలేదు.

తీర్ధ యాత్రలకు వెళ్ళాలన్న కోరిక తీర్చుకోవాలని ఆలోచనవచ్చింది.

తన దగ్గర వున్న డబ్బులతో భారత దేశ యాత్రకు వెళుతూ పిల్లలకు చెప్పింది. కొడుకు" నీ ఇష్టం అమ్మా" అన్నాడు. కూతురు ఆడబ్బు ఫై కూడా ఆశ పెట్టుకుని ఉండడంతో ఫోన్ కట్ చేసింది.అయినా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు.

"ఇప్పుడయినా మీకోసం మీరు జీవించండి" అన్న వారి నినాదం నచ్చి, 60+ గ్రూప్లో శ్యామలమ్మ చేరింది. నీకు ఇప్పుడు అవసరమా అని వెక్కిరించిన ఇరుగు, పొరుగు వారి మాటలను లెక్కచేయలేదు. తనలా ఒంటరైన వారితో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్ళింది.

****సశేషం****

Posted in March 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *